వెండితెరపై కనిపించే నటీనటులకు మాత్రమే కాకుండా బుల్లితెర యాంకర్లకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. తెలుగులో బాగా కనిపించే యాంకర్లలో మొదటగా అందరూ చెప్పుకునేది సుమ కనకాల గురించి. ఇక సుమ కాకుండా ఇండస్ట్రీలో శ్రీముఖి, రష్మీ వంటి యాంకర్లు కూడా తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా శ్రీముఖి, రష్మి, సుమలాంటి స్టార్ యాంకర్స్ పారితోషికం రేంజ్ ని పెంచేసారు. దీంతో ఒక్కసారిగా మేకర్స్ షాక్ అయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం అందరికన్నా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యాంకర్ గా శ్రీముఖి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
ప్రస్తుతం తెలుగులో సుమ కనకాలకు మించిన స్టార్ యాంకర్ ఎవరు లేరు. ఇప్పటివరకు అందరికన్నా హైయెస్ట్ పారితోషం తీసుకుంటున్న యాంకర్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కానీ రీసెంట్ గా పెరిగిన రెమ్యూనరేషన్ తో సుమ స్థానాన్ని రీప్లేస్ చేసింది యాంకర్ శ్రీముఖి. ప్రజెంట్ సుమ ఒక్కో షో కి లేదా ఈవెంట్ కి రూ. 80000 నుంచి లక్ష రూపాయలు వరకు పారితోషకం తీసుకుంటూ వచ్చింది. కాగా ఒక్కసారిగా ఆ సంఖ్యను రూ. 20000 పెంచేసి, ఇప్పుడు ఒక్కొక్క షోకి రూ. 1,20,000 పైగానే తీసుకుంటుందట. నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీముఖి ఆ తర్వాత పటాస్ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు అందుకుంది.
అయితే శ్రీముఖి ఎన్నడూ లేని విధంగా ఒకేసారి దాదాపు రూ. 60000 పారితోషకం పెంచేసి గుండె గభేలుమనేలా చేసింది. గతంలో శ్రీముఖి ఒక్కో షో కి రూ. 80000 తీసుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపుగా రూ. 1,50,000లకు చేరింది. అంతేకాదు ఈమె జడ్జిగా చేస్తున్న షోకి ఏకంగా ఒక్క ఎపిసోడ్ కి 2 లక్షలు ఛార్జ్ చేస్తుందట. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన యాంకర్ రష్మీ గౌతమ్. ఈ మధ్యకాలంలో రష్మీ పాపులారిటీ తగ్గిపోయింది. అయినా కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. దాదాపు రష్మీ ఒక్క షోకి రూ. 60000 నుండి 70000 తీసుకుంటూ వచ్చేదట. ఇప్పుడు ఏకంగా దాన్ని లక్ష రూపాయలు చేసేసిందట.