Anchor Varshini : బుల్లితెర యాంకర్స్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో వర్షిణి సౌందరరాజన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా తనదైన అందం, హోస్టింగ్‌తో అలరిస్తోంది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకోవడంతోపాటు ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంది. ఇక ఈ మధ్య కాలంలో టీవీలో షోల కంటే సినిమాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత పీక్స్‌లో ఉంటుందనే చెప్పాలి.
సినిమా ఇండస్ట్రీని ఏలేయాలని ఇండస్ట్రీలోకి వచ్చిన వర్షిణికి నిరాశే ఎదురైంది. వెండితెర, బుల్లితెరపై పెద్దగా ఈ అమ్మడు రాణించలేకపోయింది. వర్షిణి చేసిన సినిమాలు షోస్‌కి ప్రత్యేక గుర్తింపు రాకపోవడంతో ఈ అమ్మడు కొన్నాళ్లుగా సైలెంట్ అయింది. అయితే పెళ్లి చేసుకోవడానికి సెటిలైపోవడానికి సిద్ధపడిందట వర్షిణి. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నప్పటి నుంచి తనకు వాళ్ళ బావ అంటే ఎంతో ఇష్టమని.. వాళ్ళ బావకి కూడా తనంటే ఇష్టమని ఈ క్రమంలోనే అతడిని పెళ్లి చేసుకునేందుకు వర్షిణి సిద్ధమైనట్టు టాక్.
వర్షిణి చేసుకోబోయే వ్యక్తి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని తెలుస్తుండగా.. అతడు కోట్ల ఆస్తికి అధిపతట. వన్ అండ్ ఓన్లీ సన్. దీంతో ఆస్తి మొత్తం వర్షిణిదే అంటున్నారు. అక్టోబర్ ఆఖరున ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలుస్తుంది. మోడల్‌గా హవాను చూపిస్తోన్న సమయంలోనే వర్షిణి చందమామ కథలు అనే తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ ఇవ్వలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ చేసి మంచి బ్రేక్‌ను దక్కించుకుంది. అక్కడ నుండి బుల్లితెరపై ఆఫర్స్ వరుసగా అందుకుంటోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…