Anchor Pradeep : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరించే యాంకర్స్ లో ప్రదీప్ ఒకరు. యాంకర్స్ లలో కూడా అందరికంటే ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ అతనే అందుకుంటున్నాడు. అయితే యాంకర్ ప్రదీప్ పెళ్లికి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. గతంలో ఒక రాజకీయ నేత కూతురితో ప్రదీప్ పెళ్లి జరగనుందని వార్తలు వినిపించగా, ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన రాకుండానే ఆ ప్రచారం ఆగిపోయింది. ఇక తాజాగా ప్రదీప్ పెళ్లికి సంబంధించి మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి.నవ్య అనే ఫ్యాషన్ డిజైనర్ ను ప్రదీప్ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ఈమెకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబానికి చెందిన యువతి ఆమె అని తెలుస్తోంది.
ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉన్నప్పటికీ నవ్య సోషల్ మీడియాలో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడరు.బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా క్యాస్టూమ్స్ డిజైన్ చేయడం ద్వారా నవ్య పాపులారిటీని సంపాదించుకోగా, ఈమెని 2023 లో ప్రదీప్ పెళ్లి చేసుకోనున్నాడని, త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. ప్రదీప్ నవ్య కులాలు కూడా వేరని అయినప్పటికీ ఒకరినొకరు ఇష్టపడటంతో పెద్దలు పెళ్లికి అంగీకరించారని టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సారైన జరుగుతున్న ప్రచారాలలో నిజం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
యాంకర్ ప్రదీప్ మొదట సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలని అనుకోగా, ఆ తర్వాత టెలివిజన్ రంగంలో అతనికి మంచి గుర్తింపు రావడంతో అక్కడే చాలా బిజీ గా మారిపోయాడు. మొదట అతను చిన్నచిన్న టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత రియాల్టీ షోలతో మంచి యాంకర్ గా గుర్తింపును అందుకున్నాడు. ప్రదీప్ ఎలాంటి షో చేసిన కూడా అందులో మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం అయితే చేస్తాడు.ఇటీవల 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాతోను అలరించాడు. తన రెండో సినిమాపై అయితే ఎలాంటి క్లారిటీ లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…