Anasuya : సోషల్ మీడియాలో అనసూయని, వివాదాల్ని వేరు చేసి చూడలేం. బోల్డ్ గా ఉండడం ఆమె స్టయిల్. ఇటీవలి కాలంలో ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు, అనసూయకు మధ్య జరిగిన సోషల్ మీడియా వార్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ నటి మరోసారి వివాదాస్పదమైంది. రీసెంట్‌గా ఖుషి సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ఆ పోస్టర్ లో ‘ది దేవరకొండ’ అని వేశారు. సాధారణంగా పేరు రాస్తే సరిపోతుంది. కానీ ముందు ఇలా ‘ది’ అనే అక్షరాన్ని చేర్చారు. దీన్ని అనసూయ పట్టుకుంది. పైత్యం ఎక్కువైందని, అది మనకు అంటకుండా జాగ్రత్త పడాలని ట్వీట్ చేసింది.
అనసూయ ట్వీట్ వేసిన వెంటనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. అనసూయపై మరోసారి ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఎప్పటి మాదిరిగానే ఆంటీ అనే సంభోదనను తెరపైకి తెచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. ఈసారి అసూయఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు. దాంతో అనసూయ.. . `భలే అంటున్నార్రా దొంగ ఊప్స్.. బంగారు కొండలంట, ఎక్కడో అక్కడ నేను నిజం అనేది ప్రూవ్ చేస్తునే ఉన్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలు` అని పేర్కొంది. అనసూయ డైహార్డ్ ఫ్యాన్స్ ట్విట్టర్ నుంచి ఆమెని బూతులతో తిడుతున్న పోస్ట్ కి కూడా ఈమె రిప్లై ఇచ్చింది.
అలానే స్టార్ హీరోలని ఉద్దేశించి కూడా ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.. ఫ్యాన్స్ విషయంలో హీరోలు ఎందుకు జోక్యం చేసుకోరనేది ఆమె ప్రశ్నిస్తుంది. `ఈ స్టార్స్ అంతా తమ ఫ్యాన్స్ పేరుతో ఎలాంటి తప్పు చేసినా నిలదీయడానికి ఏం ఆపుతుందో అర్ధం కావడం లేదు. గొప్ప శక్తితో గొప్ప బాధ్యత వస్తుంది. నాకిచ్చిన పవర్‌లో నేను బాధ్యత వహిస్తున్నా, అభిమానులు, ఫాలోయింగ్ పోతుందని ఆలోచిస్తున్నారా? అలాంటి ఫాలోయింగ్ లేకుంటేనే బెటర్ కదండీ` అంటూ మరో ట్వీట్ వదిలి హాట్ టాపిక్‌గా మారింది అనసూయ. ఈ అమ్మడి ట్వీట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…