Anasuya : అనసూయ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. జబర్దస్త్ బ్యూటీగా మస్త్ పాపులర్ అయిన యాంకర్ అనసూయ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టేసింది. జబర్ధస్త్ నుండి బయటకు వచ్చిన తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అరి అనే సినిమాతో రెడీ అయింది అనసూయ. పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన జయ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా రెండు నిమిషాల 3 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో అనసూయకు సంబంధించిన సన్నివేశాలు మేజర్ హైలైట్ అయ్యాయి.
అయితే అనసూయ ఇటీవల తన సినిమాలు, కార్యక్రమాల కన్నా వివాదలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. తన కాస్ట్యూమ్‌పై, చేసే పనులపై నిత్యం విమర్శలు వెళ్లగక్కడంతో తనదైన శైలిలో వారికి ఇచ్చి పడేస్తుంది. తన కన్నా పెద్ద స్టార్స్ అయిన సరే వారికి కౌంటర్ ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. ఆ మధ్య కోట శ్రీనివాసరావు ఆమె కురచ దుస్తులపై కామెంట్ చేయగా, దానిపై స్పందించిన అనసూయ.. తీవ్ర పదజాలంతో ఆయనపై విరుచుకుపడింది. ఆడవాళ్లపై మీ పరిమితులు ఏంటి? మమల్ని జడ్జి చేయడానికి మీరెవరు? అని ఘాటుగానే స్పందించింది.
అయితే తాజాగా ఇదే విషయం ప్రస్తావిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘మహిళలు పిల్లల్ని కనమని, కనొద్దని… జాబ్ చేయాలని చెయ్యొద్దని.. లావు గా ఉండాలని కాదు బక్కగా ఉండాలని జడ్జి చేయబడుతున్నారు’ అంటూ అసహనం తెలియజేస్తున్న ఒక వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ వీడియో బూతు పదాలతో నిండి ఉన్న నేపథ్యంలో అనసూయ ఫ్రస్ట్రేషన్ లో ఇలా బూతుల వీడియోలు పోస్ట్ చేస్తుందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ దృష్టంతా పుష్ప2 మీద ఉంది. ఈ సినిమాలో తన పాత్రతో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకోవాలని అనుకుంటుంది.