Anasuya : జబర్ధస్త్ షోతో లైమ్ లైట్‌లోకి వచ్చిన అనసూయ ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. రంగస్థలంతో నటిగా కూడా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ అందాలతో అలరింపజేయడమే కాకుండా వివాదాలను కొని తెచ్చుకుంటుంది. కొద్ది రోజులుగా అనసూయపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తుండగా వాటికి ఘాటుగానే స్పందిస్తూ వస్తుంది. కేరళలో అతి పెద్ద పండగ అయిన ఓనం ఫెస్టివల్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ అనసూయ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. కంప్లైంట్స్ విషయం ఎంత వరకు వచ్చింది..? అని అడిగాడు.
ఈ ట్వీట్‌కు మరో నెటిజన్ రిప్లై ఇస్తూ.. నీలా మాకు పనిపాట లేని అనుకుంటున్నావా అని పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్లు చెప్పి పంపించేశారంట.. అని సమాధానం ఇచ్చాడు. ఈ కామెంట్‌పై అనసూయ ఫైర్ అయింది. మీలా పనిపాట లేని వాళ్లకు బుద్ధి చెప్పే టైమ్ వచ్చిందంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మీలా పనిపాట లేని వాళ్లకు బుద్ధి చెప్పే టైమ్ వచ్చిందని చెప్పారండి. మీకు నోరు జారటంలో తొందర ఎలాగూ ఉంది. బోల్తా పడటానికి కూడా తొందరే కదా మీకు. కాస్తా ఓపిక పట్టండి. అన్ని జరుగుతాయి. జరుగుతున్నాయి.. అంటూ రాసుకొచ్చింది. ఎవరైనా ఆంటీ లేదా అంకుల్ అని పిలిస్తే ఏ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చు..? అని మరో నెటిజన్ ప్రశ్నించాడు.
మీరు అలా అన్నందుకు కాదు.. ఆంటీ పేరుతో నన్ను ద్వేషిస్తున్న తీరుతో బాధపడ్డాను. నా కెరీర్‌ను దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతున్నది. నా మానసిక ప్రశాంతతను హరించి వేస్తున్నారు. అది శిక్షార్హమైన నేరం అని అనసూయ ట్వీట్ చేసింది. మొత్తానికి నెటిజన్స్ కి, అనసూయకి మధ్య వార్ చాలా ఆసక్తికరంగా మారుతుంది. మరి ఇది ఎంత వరకు వెళుతుందనేది చూడాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…