Anam Venkata Ramana Reddy : ప్రస్తుతం ఏపీలో రాజకీయం ఏ రేంజ్‌లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఓ వైపు పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులకి చెమటలు పట్టిస్తుంటే మరోవైపు తేదేపా కార్యకర్తలు అనేక విషయాలపై టీడీపీ నాయకులకి చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన బాబాయి రూప్ కుమార్ యాదవ్‌తో ఉన్న విభేదాలు తేల్చుకొని.. తమ యువనేత లోకేశ్‌పై విమర్శలు చేయాలని తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి హితవు పలికారు. గూడూరు నియోజకవర్గం తాడిమేడు యువగళం పాదయాత్ర బస ప్రాంతంలో ఆనం మీడియా సమావేశం నిర్వహించారు. మా నాయకుడు లోకేశ్ అమెరికాలో చదివాడని గర్వంగా చెప్పుకుంటామని.. మీ నాయకుడు ఏం చదివాడో, ఎక్కడ చదివాడో చెప్పగలవా అని ప్రశ్నించారు.
మాదకద్రవ్యాల సొమ్ము పంపకాల్లో తేడాలొచ్చి నిరాశ, నిస్పృహకు లోనైన అనిల్ కుమార్.. టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.. ఎప్పుడూ వరదలు రాని సర్వేపల్లి కాలువకు రక్షణ గోడలు కట్టించి, ప్రజల సొమ్ము కొట్టేసిన పెద్ద అవినీతిపరుడు అనిల్ కుమార్ అని ఆరోపించారు. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో అనిల్ కుమార్, రూప్ కుమార్ వాటాలతోపాటు, కొంతవాటా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిందని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న డ్రగ్స్ మూలాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించి తెర వెనకున్న పెద్ద తలకాయల్ని తక్షణమే అరెస్ట్ చేయించి జైలుకు పంపాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.
లోకేష్ ని అరేయ్, ఒరేయ్ అంటూ విమర్శించిన మాజీ మంత్రి అనిల్ని చెడగుడు ఆడేసుకున్నాడు. మొరిగేవాటన్నిటికీ తాను సమాధానం చెప్పనంటూనే దమ్ముంటే రాజీనామా చెయ్ తేల్చుకుందామని అనిల్ కి సవాల్ విసిరారు ఆనం.ఒరేయ్ లోకేష్ అని నువ్వు అన్నావ్.. ఒరేయ్ జగన్‌గా అని మేం అని అనొచ్చా.. కాస్త బుర్ర వాడు. లోకేష్ పప్పు అన్నావ్..అతను స్టాన్ ఫార్డ్‌లో చదివాడు. ప్రపంచంలో పెద్ద యూనివర్సిటీలో చదివాడు. మీ జగన్ పదో తరగతి చదివాడు. అది కూడా ఫెయిల్.. పాస్ అయ్యాడో అనుకుందాం..నీ పార్టీ వాళ్లు నిన్ను బంగారు బూతులు తిడుతున్నారు బంగారు కొండ. రెడ్ నోటీస్ వచ్చిన కూడా రూప్ కుమార్ యాదవ్ ని భయపెడుతున్నట్టు అర్ధమవుతుంది. మా ప్రభుత్వం వస్తే మేమెంటే మీకు నిరూపిస్తాం అని సవాల్ విసిరారు ఆనం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…