Ambati Rambabu : మార్చిలో ఏపీ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో టీడీపీ,వైసీపీ, జనసేన ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇదే క్రమంలో ఒకరిపై ఒకరు దారణమైన విమర్శలు చేసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్‌పై దారుణమైన కామెంట్స్ చేశారు. టీడీపీ ఈ రకంగా నాశనం అవ్వటానికి లోకేశ్ కారణమని మంత్రి అంబటి పేర్కొన్నారు. పవన్‌కు ఏ బలం ఉందని టీడీపీకి మద్దతు ఇస్తాడని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు కక్షసాధింపు ఏంటిని ప్రశ్నించారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పారు.
ఆలోచన లేకుండా లోకేశ్ మాట్లాడిన కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయని అంబటి చెప్పుకొచ్చారు. చంద్రబాబు సైతం వైఎస్సార్ తనను ఏం చేయలేకపోయారంటూ జగన్ గురించి మాట్లాడారని గుర్తు చేసారు. పార్టీ నిర్ణయించిన విధంగా ఈ నెల 26 నుంచి వైయస్‌ఆర్‌సీపీ బస్సు యాత్రలు ప్రారంభమవుతాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అవినీతిలో కూరుకుపోయిన తెలుగు దేశం పార్టీని కాపాడటం ఎవరి వల్ల కాదని పేర్కొన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని టీడీపీ నేతలు చెప్పటం లేదన్నారు. 17ఏ చూపించి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పైన కక్ష్య సాధించాలంటే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జరిగేదని..ఇప్పుడు పూర్తి ఆధారాలతో అరెస్ట్ జరిగిందని మంత్రి అంబటి చెప్పుకొచ్చారు.
చంద్రబాబు అరెస్టైతే చాలా మంది చనిపోయారని టీడీపీ అనుకూల పత్రికల్లో రాస్తుంటే… లోకేష్ మాత్రం ఢిల్లీలో ఉంటున్నారని అంబటి చెప్పుకొచ్చారు. నిజంగా చంద్రబాబు అరెస్ట్ వార్త విని అంతమంది చనిపోతే వారి కుటుంబాలను లోకేష్ పరామర్శించకుండా ఢిల్లీ పోయి ఏం చేస్తున్నాడు. టీడీపీకి ఇంకా ఏమైనా ప్రాణం ఉంటే అది కూడా పోగొట్టే పనిలో లోకేష్ ఉన్నాడనే విషయం ఆ పార్టీ శ్రేణులు గుర్తించాలని అంబటి సూచించారు. టీడీపీకి తన మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్, వారాహి యాత్రలో మాత్రం టీడీపీ పని అయిపోయింది అని అంటున్నారని గుర్తు చేశారు. టీడీపీకి ఇంకా 23 సీట్లయినా వచ్చాయని..పవన్ కు ఒక సీటే వచ్చిందని చెప్పుకొచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…