Raghava Lawrence : నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2 చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్‌గా నిలిచింది. కంగనా రనౌత్ ఇందులో కథానాయికగా నటించింది. ఈ సినిమాకి భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే సూపర్ హిట్ అవుతుందనుకున్న ఈ చిత్రం ఫ్లాప్ కాగా, దీనిపై లారెన్స్ స్పందించారు. ”చంద్రముఖి 2 చిత్రానికి నా డబ్బులు నాకు వచ్చేశాయి. ప్రతిసారి గెలుపు మనదే కావాలంటే కుదరదు. ఒకప్పుడు గ్రూప్ డాన్సర్ నుండి డాన్స్ మాస్టర్ అయితే చాలు అనుకున్నాను. దర్శకుడు, హీరో కూడా అయ్యాను. నా గ్లామర్ కి హీరో అవకాశాలు రావడమే అదృష్టం. అందులో జయాపజయాల ప్రస్తావన అనవసరం.
నేను హీరో కావడం దేవుడిచ్చిన వరం. జిగర్తాండ డబుల్ ఎక్స్ డబ్బింగ్ పూర్తి అయ్యాక చూశాను. ఈ మూవీలో మంచి కథ ఉంది. ఎంత పెద్ద హీరో ఉన్నా కథ లేకపోతే సినిమా ఆడదు. ఈ విషయంలో కార్తీక్ సుబ్బ రాజ్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది” అన్నారు. అంటే చంద్రముఖి2 ఫ్లాప్ కి కారణం డైరెక్టర్‌దే తప్పు అన్నట్టు లారెన్స్ మాట్లాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లారెన్స్ లేటెస్ట్ మూవీ జిగర్తాండ డబుల్ ఎక్స్. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. ఎస్ జే సూర్య మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ దీపావళి కానుకగా విడుదల కానుంది. జిగర్తాండ డబుల్ ఎక్స్ ప్రమోషనల్ కార్యక్రమాలలో తెగ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.
ఇక కాంచన 4 ఎప్పుడు ఉంటుందని అడగ్గా… అన్నీ దెయ్యాల సినిమాలు తీస్తుంటే మనశ్శాంతి లేకుండా పోతుంది. కలలో కూడా అవే వస్తున్నాయి. మనసు పిచ్చి పిచ్చిగా మారిపోయింది. అయితే కాంచన 4 ఖచ్చితంగా భవిష్యత్ లో చేస్తాను, అన్నాడు. సెప్టెంబర్ 28న విడుదలైన చంద్రముఖి 2 మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో ఓ మోస్తరు వసూళ్లు అందుకుంది. తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది. కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంకి పెద్దగా ఆదరణ దక్కలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…