Ambati Rambabu : సత్తెనపల్లిలో బీసీ గర్జన సభ గ్రాండ్‌గా జరిగింది. అంబటి రాంబాబు ఈ సభలో హోరెత్తిపోయారు. ఆయన చంద్రబాబు, జనసేనలపై విమర్శల వర్షం గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని అలానే తాను ఇచ్చిన హామీలని నెరవేర్చారని ఆయన ఒక్క హామీ ఇస్తే ఆ హామీని తప్పక అమలు చేస్తారని అంబటి అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో కార్పోరేటర్ గా తెలుగు దేశం పార్టీ కార్పొరేటర్ గా తమ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన నిమ్మకాయల రాజనారాయణ ఆ తరువాతి తెలుగు దేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా భాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 2014 ఎన్నికలలో తెదేపా తరఫున సత్తెనపల్లి నియోజగవర్గం నుండి పోటీచేసి ఓడిపోయారు.
ఆసియా ఖంఢంలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ గా గుంటూరు కు చెందిన నిమ్మకాయల రాజ నారాయణను నియమిస్తానని జగన్ మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది అని అంబటి అన్నారు. అలానే ఈ పదవి కోసం పదుల సంఖ్యలో నాయకులు పోటీ పడినప్పటికీ అధృష్టం మాత్రం నిమ్మకాయలను వరించింది అని చెప్పారు. ఇక చిన్నవాడు అయిన నాగార్జున యాదవ్ కూడా మంచి ప్రతిభావంతుడు. తెలుగు దేశం వాళ్లకి గట్టిగా బదులిచ్చాడు. అందుకే ఆయనకి మంచి పదవి ఇచ్చారు. ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యలో కార్యకలాపాలను కొనసాగిస్తోందీ సంస్థ.
ఈ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా వైఎస్ఆర్సీపీ యువనేత యనమల సాయి నాగార్జున యాదవ్ నియమించారని చెప్పుకొచ్చారు. వారిద్దరికి నేను సన్మానం చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు. ఇటీవల చంద్రబాబు, లోకేష్ వైసీపీ ప్రభుత్వం రాదంటూ కోతలు కోస్తున్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వం కాదు చచ్చేది అది అని ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. అంబటి మాట్లాడే సమయంలో సభ హోరెత్తిపోయింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…