Amani : సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడి పంబ’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన ఆమని స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కొద్దిరోజుల క్రితం ఈ నటి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. తమిళ్ ఇండస్ట్రీలో తను ఫేస్ చేసానంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జంబ లకిడి పంబ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, శుభ సంకల్పం వంటి అద్భుతమైన సినిమాల్లో నటించారు. రెండు సార్లు నంది అవార్డులు కూడా అందుకున్నారామె. తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాల్లో నటించిన ఆమని పెళ్లి చేసుకున్నాక కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆమని సత్తా చాటుతుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి, హలో గురు ప్రేమ కోసమే, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాల్లో నటించారు. అయితే కొద్దిరోజుల క్రితం మీడియాతో మాట్లాడిన ఆమని తను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎదుర్కున్న కష్టాలు ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో సోషల్ మీడియా అందుబాటులో లేదు కాబట్టి అప్పటి హీరోయిన్స్ ఎదుర్కొన్న చేదు సంఘటనలు అంతగా బయటపడలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా చాలా అందుబాటులో ఉంది. గతంలో నన్ను ఒక సినిమాలో స్విమ్ సూట్ వేసుకొని స్విమ్మింగ్ చేయమని అన్నారు.అయితే నేను ఈ పాత్రకి ఒప్పుకునే ముందు డైరెక్టర్ నీ డ్రెస్ మొత్తం విప్పేయ్యు నీ ఒంటి మీద ఎక్కడైనా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయేమో చూస్తాను అన్నాడు.
దాంతో నాకు ఈ సినిమా వద్దు ఆ క్యారెక్టర్ వద్దు అంటూ అక్కడ నుండి వచ్చేసా. అయితే ఇది జరిగింది టాలీవుడ్ లో కాదు కోలీవుడ్ లో నాకు ఈ చేదు అనుభవం ఎదురయింది. అలాగే మొదట్లో నాకు క్యాస్టింగ్ కౌచ్ అంటే పెద్దగా తెలియదు.అంతేకాకుండా దర్శక నిర్మాతలు అప్పట్లో తమ మేనేజర్లను మీకు డైరెక్టర్ స్టోరీ చెబుతానన్నారు ఒకసారి ఆయన రూమ్ కి రండి అని పిలిచేవారు. కానీ అసలు వాళ్ళు ఏమి ఆశించి అడుగుతున్నారో నాకు అర్థం అయ్యేది కాదు. అయితే కొంతమంది మాత్రం మీ మమ్మీ వద్దు ఒక్కరే రండి అని డైరెక్ట్ గా చెప్పడంతో వీళ్ళు నా నుండి కమిట్మెంట్ కోరుకుంటున్నారు అని అర్థమై చాలా సినిమాలను వదులుకున్నాను.అయితే ఇలా చిన్నచిన్న సంస్థల వాళ్ళు చేశారు కానీ పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు ఇలా హీరోయిన్లను వేధించలేదు అంటూ ఆమని క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…