Allu Sneha Reddy : అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బన్నీ భార్యగానే అందరికీ పరిచయమైన స్నేహా.. తనకంటూ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ గుర్తింపు సాధించారు. వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టారు. పిల్లల కోసమే ప్రత్యేకంగా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. పికబు అంటూ చిన్నారుల అవసరాలు, వారి ఆట వస్తువులు, వారిలో క్రియోటివిటీని పెంచేలా, వారిని ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేలా చేసే పలు ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. రీసెంట్‌గా కూతురితో కలిసి వెళ్లిన స్నేహా రెడ్డి తెగ సందడి చేసింది.
అర్హ అయితే గేమ్స్ సరదాగా ఆడుతూ హుషారుగా కనిపించింది. అర్హని అలా చూసి ప్రతి ఒక్కరు మురిసిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే అల్లు స్నేహా పిల్లల పెంపకం గురించి ఓ వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. ఈ తరం పిల్లలు అయితే చదువులు లేదా ఇంటికి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. తల్లిదండ్రులు కూడా అల్లరి చేయకుండా ఒక దగ్గర కూర్చుని ఫోన్ చూస్తుండటంతో తలనొప్పి తగ్గిందని స్మార్ట్ ఫోన్లు అలవాటు చేస్తుంటున్నారు. దీని వల్ల పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతోంది. క్రియేటివిటీ లోపిస్తోంది. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి, వారికి ఫిజికల్ యాక్టివిటిని పెంచడానికి స్నేహా కొన్ని టిప్స్ ఇచ్చారు.
మొత్తం 6 పాయింట్లను తల్లిదండ్రులకు సూచించారు అల్లు స్నేహా. వాటిని పాటిస్తే పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. పిల్లలను ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండాలని, క్రియేటివ్ గా ఆలోచించాలని ప్రోత్సహించాలని మొదటి పాయింట్ చెప్పారు. వారం పాటు షెడ్యూల్ ప్రిపేర్ చేసి దానిని ఫాలో అవాలని, దీని వల్ల పిల్లల్లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. ఆరు బయట ఆడుకోనివ్వాలి, ప్రకృతి నుంచి కొత్త విషయాలు తెలుసుకోనివ్వాలి. ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ చూసే సమయాన్ని తగ్గించాలి. ఆలోచనా శక్తి పెంచుకునేలా ఎంకరేజ్ చేయాలి. జాలి, దయతో ఉండాలని వారికి నేర్పాలి. అలాగే మిగతా అన్ని పాయింట్లతో సమానమైన ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ఆరో పాయింట్. అదే తమకు తాము కొంత సమయాన్ని కేటాయించుకోవడం అని చెప్పుకొచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…