ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఒకప్పుడు హిట్ టాక్ వస్తే కానీ జనాలు థియేటర్ కు వచ్చే వాళ్ళు కాదు. కానీ అల్లు అర్జున్ కంటే ముందే మహేష్ బాబు, ప్రభాస్ కి ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. సినిమా ఎలా ఉన్నా కూడా ఫస్ట్ డే తో పాటూ ఒక వారం పాటూ కలెక్షన్స్ వచ్చేవి. అయితే 2004 సమ్మర్ బరిలోకి ఈ ముగ్గురు హీరోలు దిగారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో ఆర్య మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా మే 7న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక అదే సమయంలో మే 14వ తేదీన మహేష్ బాబు హీరోగా నటించిన నాని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కథ తో వచ్చిన ఈ ప్రయోగాత్మక చిత్రం మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. నాని సినిమా ఫ్లాప్ అవడంతో ఆ సినిమా ఆడుతున్న థియేటర్ లలో కూడా అల్లు అర్జున్ ఆర్య సినిమాను వేశారు. ఈ 2 సినిమాల తర్వాత మే 21వ తేదీన ప్రభాస్ హీరోగా నటించిన అడవిరాముడు సినిమా విడుదలైంది. అప్పటికే ప్రభాస్ వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
దీంతో అడవిరాముడు సినిమా సమయంలో ప్రభాస్ కు ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు. థియేటర్ ల వద్ద భారీ కటౌట్ లు దర్శనమిచ్చాయి. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ మూట గట్టుకుంది. మరోవైపు ఆర్య రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల మనసు దోచుకుంది. దీంతో అడవిరాముడు ఆడుతున్న థియేటర్ లలో కూడా ఆ సినిమాను తొలగించి ఆర్య మూవీనే ప్రదర్శించారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అలాగే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు.