Ali Basha : ఆలీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనదైన కామెడీతో హాస్యం పండిస్తూ అందరిని అలరిస్తుంటారు. పూరీ జగన్నాధ్ సినిమాల్లో అలీ పాత్రలకు ఒక సెపరేట్ క్రేజ్ ఉంటుంది. సినిమా కథతో సంబంధం లేకుండా అలీ కోసం ప్రత్యేకంగా ఒక స్టోరీని రెడీ చేస్తారు పూరీ. అలా పూరీ డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లో అలీ గెటప్స్, కామెడీ ఎవర్‌గ్రీన్‌గా మిగిలిపోయాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యారు. డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న అలీ.. పూరీ జగన్నాధ్, రామ్‌పై ప్రశంసలు కురిపించారు.
‘నాకు హాలీవుడ్‌లో రాంబో తెలుసు. టాలీవుడ్‌లో మా రాపో తెలుసు. ఈ సినిమాలో తను పడిన కష్టం అంతాఇంతా కాదు. రామ్ నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. పూరీ జగన్నాధ్ డైలాగ్స్‌తో, మణిశర్మ మ్యూజిక్‌తో, రామ్ ఎనర్జీ, స్టెప్పులతో స్టెప్పా మార్ ఎలా ఉంటుందో మీరు టీజర్ చూశారు. పూరీ జగన్నాధ్‌కు ఇదొక అద్భుతమైన సినిమా కాబోతుంది. తను ఎక్కడా తగ్గడు. కరెక్ట్‌గా ఒక టాబ్లెట్ వేస్తాడు. ఈ 15 తారీఖుకు ఆ టాబ్లెట్ రెడీగా ఉంది. మీరంతా రెడీగా ఉండాలి’’ అని నమ్మకంగా చెప్పారు అలీ. పూరీ జగన్నాధ్ మొదటి సినిమా ‘బద్రి’ దగ్గర నుండి ఆయన తెరకెక్కించిన ప్రతీ సినిమాను గుర్తుచేసుకున్నారు అలీ. ‘‘కోవిడ్ సమయంలో అద్భుతమైన సినిమా చేయాలని లైగర్ ట్రై చేశారు. కానీ భగమంతుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ప్రతీ ఒక్కరికి ఒక హిట్, ఫ్లాప్ ఉంటుంది.
ఏ డైరెక్టర్, నిర్మాత అయినా ఫ్లాప్‌ను తీయాలని అనుకోరు. జనాల్ని మెప్పించాలి, హిట్ కొట్టాలి అనే ఉద్దేశ్యంతోనే సినిమాలు చేస్తారు’’ అంటూ ‘లైగర్’ ఫెయిల్యూర్‌పై స్పందించారు అలీ. థియేటర్లకు పట్టిన తుప్పును వదిలించడానికి ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తున్నాడని అన్నారు. హీరోయిన్ కావ్య థాపర్ డ్యాన్స్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. మూవీ టీమ్ అంతా సినిమా కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు. ‘అమెజాన్ ఫారెస్ట్‌లో ఒక భాష ఉంటుంది. ఆ భాషను కనిపెట్టి నా క్యారెక్టర్‌ను క్రియేట్ చేశాడు పూరీ జగన్నాధ్. నాకోసం అలాంటి అద్భుతమైన క్యారెక్టర్‌ను సృష్టించినందుకు సంతోషంగా చేశాను. నా కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ముంబాయ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా చల్లగా ఉంది’’ అంటూ తన స్టైల్‌లో ఈ క్యారెక్టర్ గురించి కామెడీగా వివరించారు అలీ.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…