Akira Nandan : సినీ ఇండస్ట్రీలో వారసుల హవా ఎక్కువగానే ఉంటుంది. హీరోల పిల్లలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ తనయుడు సినిమా ఇండస్ట్రీ ఎంట్రీకి సంబంధించి కూడా జోరుగా చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం చదువుకు, సంగీతం నేర్చుకోవటంతో పాటు అడపా దడపా బయట కనిపిస్తున్నాడు అకీరా. అయితే అభిమానులు అతని సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఇటీవలే అకీరా 19 బర్త్ డేజరుపుకున్నాడు. ఆ రోజు ఏదైన అకీరా సినిమాకి సంబంధించి అప్‌డేట్ వస్తుందా అని చూశారు.
తాజాగా అకీరా సినిమా ఇండస్ట్రీ ఆరంగేట్రంకి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అభిమానులు అందరు అకీరాను సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా చూడాలనుకుంటున్నారు. కానీ అకీరా మాత్రం సైలెంట్‌గా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అవుతున్నారనిపిస్తుంది. ఎందుకంటే రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు అకీరానే సంగీతాన్ని అందించాడు. ఈ విషయాన్ని హీరో అడివిశేష్ తెలియజేస్తూ రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్ లింక్‌ను ట్వీట్ చేశారు. ఓ రైటర్ కథను రాసే క్రమంలో ఎలాంటి సవాళ్లను ఫేస్ చేశాడనేదే ఈ షార్ట్ ఫిల్మ్ కథాంశం.
ఈ షార్ట్ ఫిల్మ్ వ్యవథి నాలుగున్నర నిమిషాలు కాగా, ఇందులో మ్యూజిక్ బావుందని కామెంట్స్ వస్తున్నాయి. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఇంగ్లీష్‌లోనే తెరకెక్కించారు. కార్తికేయ యార్లగడ్డ దీన్ని తెరకెక్కించారు. హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరు చూస్తున్న సమయంలో అకీరా సైలెంట్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌లా ఎంట్రీ ఇచ్చేసి అందరికీ షాకిచ్చాడనే చెప్పాలి. అయితే ఇది గుడ్ న్యూస్ అయినా.. మెగా అభిమానులకు ఇందులో ఒకింత బ్యాడ్ న్యూస్ కూడా అని చెప్పాలి. ఎందుకంటే అకిరా సినిమాల్లోకి వ హీరోగా రావడం లేదు. అవును.. మ్యూజిక్ డైరెక్టర్ గా అకిరా ఎంట్రీ ఇస్తున్నాడు. నిజంగానే పవన్ తనయుడికి హీరో కావాలని లేదా? లేక మ్యూజిక్ హాబీగా నేర్చుకుని ఈ షార్ట్ ఫిల్మ్‌కు సంగీతం అందించాడా? అనేది తెలియటం లేదు.