Aha Naa Pellanta Series : సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె, యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రదాన పాత్రలలో రూపొందిన వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట. ఈ వెబ్ సిరీస్ లో హర్షవర్ధన్, ఆమని, పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను వంటి వారి కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమ్ అవుతుంది. జీ5లో విడుదలైన `అహనా పెళ్ళంట` వెబ్ సిరీస్ ఏకంగా 50 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్ ని రీచ్ అయిందనే విషయాన్ని తాజాగా చిత్ర బృందం వెల్లడంచింది. ఇక ఐఎండీబీ ప్రకటించిన టాప్ టెన్ ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల లిస్టులోనూ ‘అహ నా పెళ్ళంట’ చోటు దక్కించుకుందనే విషయాన్ని వాళ్లు తెలియజేశారు.
తెలుగులో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనింగ్ సిరీస్‌ను అన్నీ భాషల్లో ప్రమోట్ చేయగా, కంటెంట్ బాగుండడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ లో రఘు కారుమంచి, మధునందన్, కృతికా సింగ్, తాగుబోతు రమేష్, గెటప్ శీను, భద్రం, త్రిశూల్, దొరబాబు, వరంగల్ వందన, రాకేష్ రాచకొండ వంటి వారు ప్రధాన పాత్రలలో కనిపించి మెప్పించారు. ఏబిసిడి సినిమా దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించగా, కళ్యాణ్ రాఘవ్ డైలాగ్స్ అందించారు.
కథ విషయానికి వస్తే..ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకోవాలని భావించగా, ఆ సమయంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటనే నేపథ్యంలో వెబ్ సిరీస్ రూపొందించారు. . కథానాయకుడు పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కూతురు వేరే వాడితో వెళ్లిపోతుంది. అప్పుడు హీరో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోగా, అప్పుడు కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా. ఇది సినీ విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. శివాని రాజశేఖర్ ఎలా అయినా హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనేక ప్రయత్నాలు చేయగా ఆమెకు ఇది మంచి ప్లస్ అవుతుందనే చెప్పాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…