Aadipurush : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రలలో ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. భారీ అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఆదిపురుష్ చిత్రం అంచనాలని అందుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అనేక విమర్శలను ఎదుర్కొన్న ‘ఆది పురుష్స టీమ్ ఎట్టకేలకు ‘గుడ్ న్యూస్’ చెప్పింది. ఎడిటింగ్, మార్చిన సంభాషణలతో కూడిన 3డీ వెర్షన్‌కు సకుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానిస్తూ, ఇందుకోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఇక దాదాపుగా 400 కోట్లతో నిర్మించిన ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రభాస్‌కు 120 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇక సీత పాత్రలో నటించిన కృతి సనన్‌కు 3 కోట్లు, లంకేష్‌గా నటించిన సైఫ్ అలీ ఖాన్‌కు 12 కోట్లు, లంకేష్ భార్యగా నటించిన సోనాల్ చౌహాన్‌కు 50 లక్షలు, లక్ష్మణుడిగా చేసిన సన్నిసింగ్‌కు 1.5 కోట్లు, హనుమాన్‌గా చేసిన దేవ దత్తుకు కోటీ రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సినిమా నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ మూవీకి మాత్రం కొందరు క్యూ కడుతున్నారు. తాజాగా అఘోరాలు ఆదిపురుష్ థియేటర్ ముందు రచ్చ చేయడం చర్చనీయాంశంగా మారింది.
చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించడంతో ఆయనని దేవుడిలా కనిపిస్తూ థియేటర్ ముందు నానా రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక బాలకృష్ణ నటించిన అఖండ సినిమా సమయంలో కూడా అఘోరాలు తెగ సందడి చేశారు. థియేటర్ కి వెళ్లి మూవీని చూసి ఎంజాయ్ చేశారు. మొత్తానికి అఘోరాల దృష్టిని కూడా ఆకర్షించిన ఆదిపురుష్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అంతగా అలరించలేకపోతుంది. ఈ సినిమాలో మొదట సీత పాత్ర కోసం కృతి సనన్ కాకుండా దీపికా పదుకోణేను అనుకున్నారట. అంతేకాదు ఈ పాత్రకోసం ఆమెను సంప్రదించారట. అయితే అప్పటికే ఆమె పలు సినిమాలతో బిజీగా ఉండడంతో.. ఆదిపురుష్ సినిమాలో నటించలేకపోయారట. దీంతో ఆ రోల్ చివరకు కృతి సనన్‌కు చేరిందని టాక్ నడుస్తోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…