Adivi Sesh : అడివి శేష్.. ఈ కుర్ర హీరో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించేశారు. పాన్ ఇండియన్ హీరోగా కూడా మారాడు. త్రూ అవుట్ ఇండియా తకంటూ మార్కెంట్ క్రియేట్ చేసుకున్నారు. రాబోయే తన సినిమాలను కూడా పాన్ ఇండియా లెవల్లోనే రిలీజ్ చేస్తున్నా అంటూ అనౌన్స్ చేశారు. మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన అడివి శేష్ ఇప్పుడు హీరోగా ఎదిగాడు. ‘ఎవరు, గూఢచారి, మేజర్’ చిత్రాల వరుస సక్సెస్‌తో మోస్ట్ ప్రామినెంట్ హీరోగా మారిపోయాడు. రీసెంట్‌గా తను నటించిన ‘హిట్2’ మూవీ కూడా మంచి విజయం సాధించింది.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేశాడు. టాలీవుడ్‌లో ప్రతి ఫ్యామిలీ నుంచి కనీసం 10 మంది హీరోలు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో బయటి వ్యక్తికి మంచి స్క్రిప్ట్ దక్కడం చాలా కష్టం అవుతుందని చెప్పుకొచ్చాడు.. ఒక సినిమా ఫ్లాప్ అయితే తాను డిప్రెషన్‌కు గురికానని.. అయితే చేసిన పొరపాట్ల గురించి పాజిటివ్‌గా విశ్లేషించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు రైటింగ్ మొదలుపెట్టిన తర్వాత తను నటించిన చివరి ఆరు చిత్రాల్లో నాలుగింటికి స్క్రిప్ట్ రాయడం లేదా సహకారం చేశానని చెప్పాడు అడివి శేష్. మంచి స్క్రిప్ట్స్ కోసం చాలాకాలం ఎదురుచూసి విసిగిపోవడం వల్లనే తాను రైటింగ్‌లోకి రావడానికి కారణమని ఆయన అన్నారు.
ఒక్కో ఫ్యామిలీ నుంచి పది మంది హీరోలు ఉంటారు. మంచి స్క్రిప్ట్ మీదాకా రావాలంటే మీ నంబర్ 53 అయి ఉంటుంది. అదే టైమ్‌లో 20 మాత్రమే మంచి స్క్రిప్ట్‌లు ఉండటంతో మిమ్మల్ని ఎవరూ పరిగణనలోకి తీసుకోరు. మరొక విషయం ఏంటంటే.. తెలుగు సినిమాలో ఆడిషన్ కల్చర్ లేదు’ అని అన్నాడు. కనీస ప్రాముఖ్యత లేని పాత్రలకు మాత్రమే ఇక్కడ ఆడిషన్స్ ఉంటాయని అడివి శేష్ తెలిపారు. కాబట్టి లీడ్ రోల్స్ దక్కాలంటే సొంతంగా కథలు రాసుకోవడమే ఏకైక ఆప్షన్ అని అడివి శేష్ విశ్లేషించారు . తనకే అన్నీ తెలుసని అనుకోనని.. కాకపోతే ఫెయిలైతే ఎందుకలా జరిగిందో విశ్లేషించుకుంటానంటూ తెలియజేశాడు అడివి శేష్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…