Aditya 369 : ఆదిత్య 369 సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కగా ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం 1991 జూలై 18న విడుదలైంది. టైమ్ మిషన్ నేపథ్యంలో అప్పటి వరకు భారతీయ సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కథతో వచ్చిన ఈ సినిమా హాలీవుడ్‌లో వచ్చిన బ్యాక్ టూ ఫ్యూచర్ అనే మూవీ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందింది. మనిషి భవిష్యత్తులోకి లేదా గతంలోకి ప్రయాణిస్తే ఎలా ఉంటుందనే ఆధారంగా సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాతో బాలకృష్ణలో ఉన్న సంపూర్ణ నటుడిని సింగీతం బయటకు తీశారు. ఈ మూవీలో బాలయ్య అటు కృష్ణ కుమార్ గా ఇటు శ్రీకృష్ణ దేవరాయులిగా రెండు పాత్రలను వేటికవే డిఫరెంట్‌గా చేసి విమర్శల ప్రశంసలు అందుకున్నారు.
ఆదిత్య 369లో 369 అనే నంబర్ వెనుక కూడా ఒక ఆసక్తికర విషయం ఉంది. 369 అంటే పాజిటివిటి అనే అర్థం వస్తుంది. అందులో 3 అంటే మార్పు అని అర్థం. 6 అంటే కొత్త ఆరభం అని అర్థం వస్తుంది. అదే విధంగా 9 అంటే విస్తరించడం అనే అర్థం వస్తుంది. అదే విధంగా 369 అనే నంబర్ గడియారంలో సరి సమానంగా ఉండే కాలాన్ని సూచిస్తుంది. వర్తమానకాలంలో కృష్ణ మోహన్ గా, భూత కాలంలో శ్రీకృష్ణ దేవరాయలుగా బాలయ్య బాబు తన నటనతో అలరించారు. ఇక దేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగడు చెప్పబోయే పద్యాన్ని బాలకృష్ణ ముందుగానే చెబుతాడు. ఆ పద్యం అద్భుతం.
ఈ సినిమా తర్వాతే కోహినూర్ వజ్రం గురించి దాని విలువ గురించి అందరికీ తెలిసింది. ఇక నువ్వే కావాలితో స్టార్ నటుడైన తరుణ్ ను మనం మొదటగా చూసింది ఈ సినిమాలోనే. దేవరాయల ఆస్థానంలోని 8 కవులను ముఖ్యంగా తెనాలి రామలింగడి పాత్రలో చంద్రమోహన్ ను చూసి.. ఓహో దేవరాయలి భువన విజయం ఇలా ఉంటుందా అని అందరూ అనుకున్నారు. సినిమాలోని డైలాగ్స్, సుత్తివేలు కామెడీ ట్రాక్ జంధ్యాల రాసినవే కావడం విశేషం. సెంచరీలు కొట్టే వయస్సు మాది, జానవులే నెర జానవులే.., రాసలీల వేళ.. ప్రతి సాంగ్ ఓ మాస్టర్ పీస్. ఇళయరాజా మ్యూజిక్, వేటూరి, సిరివెన్నెల లిరిక్స్ అందరినీ ఎంతగానో అలరించాయి. రూ.1.50 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.9 కోట్లు వసూల్ చేసి ఇండస్ట్రీ రికార్డ్ సాధించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…