Adipurush VFX : రాధే శ్యామ్ చిత్రం తర్వాత ప్రభాస్ నుండి వస్తున్నచిత్రం ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ఐమ్యాక్స్ 3డీలో అత్యంత భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశ్వరుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మూవీ నుండి టీజర్ విడుదల చేశారు. అయితే ఈ టీజర్ బొమ్మల గారడీ మాదిరిగానే ఉందని, ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టు లేదని కొందరు ఆరోపిస్తున్నారు.
టీజర్‌లో కొన్ని సన్నివేశాలను మోషన్ క్యాప్చర్ లో యానిమేట్ చేయడంతో ఆ పాత్రలు సహజత్వాన్ని కోల్పోయాయి. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ సైతం బొమ్మల మాదిరిగా మారిపోయారు. దీన్నే ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీజర్‌లో వానరాలకు బదులు గొరిల్లాలను దించడం విమర్శల పాలు చేసింది. ఆ సన్నివేశాలన్నీ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను ముంబైకి చెందిన NY VFXWaala అనే వీఎఫ్ఎక్స్ స్టూడియో చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పుకార్లపై ఆ సంస్థ స్పందిస్తూ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఆదిపురుష్ కంప్యూటర్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ తాము చేయలేదని ఒక ప్రకటనలో NY VFXWaala పేర్కొంది. ఆదిపురుష్ సినిమా సీజీ లేదా స్పెషల్ ఎఫెక్ట్స్ కి మేము పని చేయలేదని, ఇప్పుడు కూడా పనిచేయడం లేదని వారు క్లారిటీ ఇచ్చారు. అయితే NY VFXWaala సహ వ్యవస్థాపకుడు ప్రసాద్ సుతార్ గతంలో తమ బృందం ఆదిపురుష్ చిత్రానికి పని చేస్తోందని గతంలో అనేక ఫోటోలు షేర్ చేశాడు. సుతార్ ట్విట్టర్ ప్రొఫైల్ హెడర్‌లో ఇప్పటికీ ఆదిపురుష్ చిత్రం పోస్టర్ ఉంది. మరి ఇలాంటి సమయంలో ఎవరు అబద్ధాలు చెబుతున్నారో ఎవరికీ తెలియరావడం లేదు. NY VFXWaala వీఎఫ్ఎక్స్ స్టూడియోను బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ స్థాపించారు. ఇండియన్ వీఎఫ్ఎక్స్ నిపుణులు నవీన్ పాల్, ప్రసాద్ సుతార్‌తో కలిసి అజయ్ దేవగణ్ ఈ సంస్థను నెలకొల్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…