Adah Sharma : హార్ట్ ఎటాక్ సినిమాతో పాటు సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ ఆదాశర్మ. మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అనంతరం తెలుగులో కొన్ని సినిమాలు చేసినా.. అవి ఆమెకు అంతగా గుర్తింపు రాకపోవడంతో ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అలా తాజాగా ‘ది కేరళ స్టోరీ’ అనే సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల దర్శకుడితో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. అయితే తనకి ఏమి కాలేదని క్షేమంగా ఉన్నానని పేర్కొంది.
ర్శకుడు సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీ టైటిల్ తో మూవీ తెరకెక్కించగా, ఇందులో ఆదాశర్మ హీరోయిన్ గా నటించారు. కేరళ రాష్ట్రంలో లవ్ జిహాద్ పెద్ద ఎత్తున జరుగుతుంది. హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ముస్లిం యువకులు ప్రేమించి వాళ్ళను ఉగ్రవాదులుగా మారుస్తున్నారనే అంశాలను ఈ మూవీలో ఆసక్తికరంగా చూపించారు. దీంతో రాజకీయ వర్గాలు, ముస్లిం కమ్యూనిటీ ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. హీరోయిన్ గా నటించిన ఆదా శర్మకు వేధింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఆదాశర్మ వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో పెట్టాడు.
ఆదాశర్మ ఫోన్ నెంబర్ సైతం లీక్ చేశాడు. ముస్లింలకు వ్యతిరేకంగా ఇకపై చిత్రాలు చేస్తే పర్యవసానాలు ఇంకా దారుణంగా ఉంటాయని హెచ్చరించాడు. సదరు వ్యక్తిపై ఆదాశర్మ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. జాముండా బోల్తే’ అనే పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఆదా శర్మ ఫోన్ నెంబర్ను సోషల్ మీడియాలో లీక్ చేయడంతో.. ఫ్యాన్స్ ఆ యూజర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్, ముంబై ట్విట్టర్ హ్యాండిల్స్ కు ట్యాగ్ చేస్తూ మరీ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఇన్స్టాగ్రామ్ యూజర్ అకౌంట్ డీయాక్టివేట్ అయినప్పటికీ అతని పోస్ట్‌లు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…