Actress Prabha : అలనాటి సీనియర్ నటి ప్రభ గురించి ఈ నాటి వారికి పెద్దగా తెలియకపోవచ్చు కాని అప్పటి వారికి మాత్రం ఈవిడ చాలా సుపరిచితం. ఒకప్పుడు ఎవర్ గ్రీన్ లాగా వెలిగిన ప్రభ.. ఆనాటి గొప్ప నటులు అయిన స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ మరియు నాగేశ్వరరావు లాంటి వారితో కలిసి నటించి మంచి పేరు ప్రఖ్యాతలని సంపాదించుకుంది. అలా కొంతకాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపా దడపా సినిమాలు చేస్తూ కాలాన్ని వెళ్లదీసింది. ఇప్పుడు ఉన్న ఫాస్ట్ జనరేషన్ ప్రేక్షకులకు ఆమె గురించి తెలిసింది చాలా తక్కువే అని చెప్పాలి..
‘భూమి కోసం’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సీనియర్ హీరోయిన్ కమ్ నటి ప్రభ ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. ఒక్క చంద్రమోహన్ కు జోడిగా దాదాపు 18 చిత్రాలకు పైగానే నటించి వావ్ అనిపించింది. అప్పట్లో వీరిది హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో మురళి మోహన్ తో కూడా పదహారు చిత్రాలలో నటించారు ప్రభ. అయితే ఈమెకు చాలా గోల్డెన్ ఛాన్సులు మిస్ అయ్యాయని అనిచాలా మంది అంటారు.. మెగాస్టార్ చిరు నటించిన ‘ఖైదీ’ చిత్రంలో సుమలత పాత్రకు మొదట ప్రభాను అనుకున్నారట. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాక ఆ ఛాన్స్ మిస్ అయ్యిందట.
ప్రభా జేమ్స్ బాండ్, బెంగాల్ టైగర్ వంటి చిత్రాలలోనూ నటించింది. తల్లి, వదిన పాత్రలలో నటించి మెప్పించింది. సీరియల్స్ లో సైతం ప్రభ నటించి బుల్లితెర ప్రేక్షకులని సైతం అలరించింది. అయితే తెనాలిలో పుట్టినప్పటికి గోకర్ణపురంలో జన్మించింది ప్రభ.. ఆమెకు ఇక్కడే కొడుకు కూడా పుట్టాడు. అయితే సినిమాలలో అవకాశాలు వచ్చాక చెన్నైకి వెళ్లిన ప్రభ తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ లో ఉంది. ఆమె సినిమా షూట్‌లో ఉన్నప్పుడు కారు పక్కకు ఒరిగిపోయి, రేడియేటర్‌లోని వేడినీళ్లు ఆమె కాళ్లపైకి చిందిన యాక్సిడెంట్‌కు గురైంది. ఆమె దాదాపు రెండు నెలల పాటు ఆ కాలిన గాయాలతో బాధపడింది.ఈ విషయాన్ని ఆమె పాల్గొన్న పలు టీవీ షోలలో తెలియజేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…