సినిమా ప్రపంచంలో కొందరు నటీనటులు ఎంత వేగంగా స్టార్ డమ్ సంపాదించుకుంటారో అంతే వేగంగా ఇండస్ట్రీ నుంచి దూరం అవుతారు. అలాంటి నటీనటులలో అబ్బాస్ కూడా ఒకరు. అబ్బాస్ సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే హీరోగా స్టార్ ఇమేజ్ ను అందుకుంటారు. సినీ ప్రముఖుల సైతం అప్పటిలో అబ్బాస్ స్టార్ హీరోగా పెద్ద స్థాయికి వస్తాడని భావించారు.
1996 లో తమిళంలో విడుదలైన కాదల్ దేశం చిత్రంతో వెండితెరకి ఎంట్రీ ఇచ్చాడు అబ్బాస్. ఈ చిత్రాన్నే మన తెలుగులో ప్రేమదేశం చిత్రంగా డబ్ చేసి విడుదల చేశారు. అటు తమిళ్ ఇటు తెలుగులో కూడా ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ప్రేమదేశం చిత్రంతో అబ్బాస్ కి యూత్ లో క్రేజ్ బాగా పెరిగింది. ప్రేమదేశం సినిమా సక్సెస్ తో అబ్బాస్ కెరీర్ అటు తమిళ్ లోను ఇటు తెలుగులోను ఒక్కసారిగా ఊపందుకుంది.
అప్పటిలో అబ్బాస్ అందానికి అమ్మాయిలు ఎగబడిపోయేవారు. అబ్బాస్ సినిమా వచ్చింది అంటే చాలు థియేటర్స్ వద్ద అమ్మాయిలు క్యూ చాలా పెద్దగా ఉండేది. ఇక అబ్బాస్ ఎలాంటి వేడుకలకు వెళ్లినా కూడా అమ్మాయిలు మొత్తం చుట్టూ ముట్టేవారు. ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న హీరో అబ్బాస్. అయితే అబ్బాస్ గత ఏడు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎక్కడ కనిపించడం లేదు. సినిమా అవకాశాలు తగ్గడంతో 2015 వరకు ఇండస్ట్రీలో ఉన్న అబ్బాస్ అనంతరం న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడ్డాడు.
న్యూజిలాండ్ వెళ్లిన మొదటిలో ముందుగా ఓ పెట్రోల్ బంకులో పని చేసాడు. బంకులో కొన్నాళ్లు పని చేసిన తర్వాత.. బిల్డింగ్ కూలీగా మారి, అక్కడే కొన్ని రోజులు పని చేసి అనుభవం సంపాదించి.. ఇప్పుడు అదే బిజినెస్ చేస్తున్నాడు అబ్బాస్. భవన నిర్మాణ రంగంలో ప్రస్తుతం బాగానే సంపాదిస్తున్నాడు అబ్బాస్. తనకు మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఉద్ధేశ్యమే లేదంటున్నాడు. మరోవైపు మోటివేషనల్ స్పీకర్‌గానూ కూడా పని చేస్తున్నాడు. ప్రస్తుతం అబ్బాస్ సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…