Abbas : అబ్బాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రేమ దేశం సినిమా చూసిన ప్రతి ఒక్కరు అబ్బాస్ పేరుని తమ గుండెల్లో అలా రిజిస్టర్ చేసుకున్నారు. అప్పటి యూత్ ని ఆకట్టుకున్న అతను సినిమాలకు గుడ్ బై చెప్పి అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. మరోవైపు హార్పిక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చాలా ఏళ్లు పని చేసిన అబ్బాస్ ఇప్పుడు అది కూడా వదిలేశాడు. 1996లో వచ్చిన ప్రేమదేశం చిత్రం తో హీరోగా పరిచయం అయిన అబ్బాస్ ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన అబ్బాస్ క్రమంగా తెరమరుగయ్యాడు.
తాజాగా, అబ్బాస్ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. హాస్పిటల్ బెడ్ పై ఒక ఫొటో, వాకింగ్ స్టిక్ నడుస్తూ మరో ఫొటో కనిపిస్తున్నాయి. దీని గురించి అబ్బాస్ వివరణ ఇచ్చారు. బైక్ పై నుంచి పడి గాయపడ్డానని, కొన్నిరోజులుగా విపరీతమైన కాలి నొప్పితో బాధపడుతున్నానని , డాక్టర్లు శస్త్రచికిత్స తప్పనిసరి అని చెప్పడంతో గందరగోళానికి లోనయి, సర్జరీ చేయించుకున్నాక ఎంతో ఉపశమనం పొందానని అబ్బాస్ పేర్కొన్నారు. డాక్టర్లకు థాంక్స్ చెప్పుకుంటున్నాను అని వివరించారు.
చేతి కర్రతో అబ్బాస్ ని చూసి అతని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. త్వరగా కోలుకోవాలని మెసేజ్ లు చేస్తున్నారు. ప్రేమదేశం టైం లో అబ్బాస్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అప్పట్లో అబ్బాస్ కటింగ్ కూడా పాపులర్. అతన్ని ఇమిటేట్ చేస్తూ చాలా మంది హెయిర్ కట్ చేసుకునే వారు. అబ్బాస్ అంటే అమ్మాయిలు కూడా పడి చచ్చిపోయే వారు. తమిళంలోనే కాదు తెలుగులో కూడా అబ్బాస్ మంచి సినిమాలు చేశాడు. తెలుగు ప్రేక్షకులకు అబ్బాస్ సుపరిచితుడే.. ఈమధ్య అసలు మీడియాకి కనిపించని అబ్బాస్ సడెన్ గా కాలికి సర్జరీ చేయించుకుని కనిపించడంతో అభిమానులు షాక్ లో ఉన్నారు. అతనికి ఇక్కడ సినిమా ఆఫర్స్ లేకపోవడంతో విదేశాలలో స్థిరపడ్డాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…