AB Venkateshwar Rao : వివేకానందరెడ్డి హత్య జరిగి ఐదేళ్లు అయిన కూడా ఇంకా ఈ హత్యకి కారణాలు ఏంటనేవి తెలియడం రాలేదు. అయితే ఇటీవల వివేక మర్డర్ కేస్ పై ద వైర్ రెండో ఎపిసోడ్ ను విడుదల చేసింది. వివేక కేసు దర్యాప్తులో సీబీఐ మరిచిపోయిన కీలక అంశాలను గుర్తు చేస్తూ ది వైర్ మరో సంచలన కథనం ప్రచురించింది. ఇప్పటికీ వివేకా కేసులో సిబిఐ ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వివేక మర్డర్ జరిగిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత సిబిఐ దాఖలు చేసిన ఫైనల్ చార్జిషీట్ లో ఎన్నో కీలక సాక్షాదారాలను సిబిఐ సేకరించలేకపోయిందంటూ ద వైర్ అభిప్రాయపడింది.మర్డర్ జరిగిన రెండు సంవత్సరాల తర్వాత అనూహ్యంగా తెర మీదకు వచ్చిన సంచలన ఆరోపణలు, అనుమానాలకు ఎలాంటి ఆధారాలు చూపకుండానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులను నిందితులుగా పేర్కొంటూ దర్యాప్తు ముగించింది.
అయితే సీబీఐ ఐదు సంవత్సరాలు ఎంక్వైరీ చేసి ఏ విషయాలు అయితే చెప్పిందో వివేకానంద రెడ్డి హత్య జరిగిన గంట తర్వాత అవే విషయాలని చెప్పారు ఏబీ వెంకటేశ్వరరావు. ఈయన అధికారంలో ఉంటే ఎక్కడ వైసీపీ వారి లొసుగులు అన్ని బయటపడాతాయనో ఆయనని విధుల నుండి తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయనను విధుల నుంచి తొలగించింది. దాంతో ఆయన న్యాయపోరాటం చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గతేడాది సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆ తర్వాత ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఆ పోస్టింగ్ ఇచ్చిన 15 రోజులకే ఆయనను మరోమారు సస్పెండ్ చేశారు. అవినీతి కేసులో సాక్షుల్ని ప్రభావితం చేశారన్న అభియోగాలతో ప్రభుత్వం ఆ మేరకు సస్పెన్షన్ వేటు వేసింది. మళ్లీ ఇంత వరకూ సస్పెన్షన్ ఎత్తివేయలేదు. దాంతో ఆయనకు పోస్టింగ్ లభించడం లేదు. అయితే వచ్చే ప్రభుత్వంలో ఆయనకు మంచి పోస్టింగ్ ఇస్తే కనుక నేరగాళ్ల అందరి గురించి మొత్తం బయటపెట్టేస్తాడు అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…