Aaradhya Bachchan : అచ్చం తల్లిని ప్రింట్ దింపేసిన ఆరాధ్య బ‌చ్చ‌న్.. ఎంత క్యూట్‌గా ఉందంటూ ఐష్ కూతురిపై ప్ర‌శంస‌లు..

Aaradhya Bachchan : ప్రపంచ సుందరిగానే కాకుండా సౌత్, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల తార ఐశ్వ‌ర్య‌రాయ్. ఇప్పటికి చెక్కు చెదరని అందంతో ఎవర్ గ్రీన్ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఐశ్వ‌ర్య‌రాయ్ అడ‌పాద‌డ‌పా సినిమాల‌తో అల‌రిస్తుంది. హీరో అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మాజీ మిస్ వరల్డ్ ..అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తూ ..అప్పుడప్పుడు పార్టీలు, ఫంక్షన్ లలో కనిపిస్తూ ప్ర‌తి ఒక్క‌రిని సంభ్ర‌మాశ్య‌ర్యాల‌కి గురి చేస్తుంది. రీసెంట్ గా జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి చివరి రోజు బిగ్ బి ఫ్యామిలీ అటెండ్ అయింది.

ఈ పార్టీకి వచ్చిన బచ్చన్ ఫ్యామిలీలో ఐశ్వర్యరాయ్ కంటే మరొకరు ఆమెను అందంలో బీట్ చేశారు.ఆమె ఎవరో కాదు ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ల ముద్దుల‌ కుమార్తె ఆరాధ్య బచ్చన్. ఈ స్టార్ కిడ్ తల్లి ఐశ్వర్యతో క‌నిపించి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది. ఆరాధ్య లుక్ చూసి అంద‌రు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గుర‌వుతున్నారు. ఐశ్వర్యరాయ్ అందం కంటే ఆరాధ్య మరింత అందంగా కనిపిస్తూ ఫోటోలకు చిక్కింది. ఇప్పుడు ఆరాధ్య అందం చూసి నెటిజన్లు ..గ్లామర్ లో తల్లిని మించిపోయేలా ఉందంటున్నారు. 90ల‌లో ఐశ్య‌ర్య‌రాయ్ ఎలా ఉందో ఇప్పుడు ఆరాధ్య అలానే ఉందంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Aaradhya Bachchan getting beautiful comments
Aaradhya Bachchan

చివరిరోజు జామ్ నగర్ లో ఎంటర్ టైనమెంట్ కార్యక్రమాలు జరిగిన విష‌యం తెలిసిందే. ఆరాధ్య తన తండ్రి, తల్లి మధ్యలో కూర్చుని ఎంజాయ్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది.ఇందులో ఆరాధ్య ఫోటోల్లో స్మైలీ లుక్స్ తో ..గార్జియస్ బ్యూటీగా అభిమానులను ఫిదా చేస్తోంది. ఆరాధ్య తళుక్కున మెరిసిపోతున్న లుక్ లోంచి ఎవ‌రు కళ్లు తిప్పుకోలేకపోతున్నారంటూ చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆరాధ్య తన హెయిర్ స్టైల్‌లో అంచులు లేకుండా చాలా అందంగా ఉంది, ఆరాధ్య తన తల్లిలా చాలా అందంగా ఉంటూ ఈవెంట్‌కి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

14 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

18 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago