Aadipurush : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్ చిత్రం నేడు ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వస్తుంది. భారతీయులు ఎంతో భక్తి శ్రద్దలతో ఆరాధించే పుణ్యపురుషుడు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన చిత్రం ఇది కావడంతో కొన్నాళ్లుగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.. రామాయణం పురాణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్నో వివాదాల మధ్య నలుగుతూ.. అదే విధంగా భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్ నటించగా .. జానకి పాత్రలో కృతి సనన్.. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు.విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలా స్పందించారనేది చూస్తే..
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాకు ప్రీమియర్స్, బెనిఫిట్‌షోల నుంచే మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ప్రభాస్ అభిమానులు మాత్రం సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ చెబుతోన్నారు. మరికొందరు ఆడియెన్స్ మాత్రం సినిమాలోని గ్రాఫిక్స్, క్యారెక్టర్స్ లుక్స్, స్టోరీ టెల్లింగ్ బాగాలేదంటూ కామెంట్స్ చేస్తోన్నారు.అప్పుడు ఎన్టీఆర్ రాముడిగా అదరగొట్టగా, ఇప్పుడు ప్రభాస్ కూడా రాముడి పాత్రలో అదరహా అనిపించాడు. నటీనటుల పర్‌ఫార్మెన్స్ బాగానే ఉందని అనిపించిన కూడా గ్రాఫిక్ వాల్యూస్ సినిమాని చాలా చెడగొట్టాయని చెప్పుకొస్తున్నారు.
ఆదిపురుష్ చూసిన ఓ యువకుడు సినిమా బాగాలేదంటూ కామెంట్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అతడిపై తిట్ల దండకానికి దిగారు. అంతటితో ఆగకుండా థియేటర్ ముందే అతడిని చితకబాదారు. రాముడి పాత్రకు ప్రభాస్ అసలు సూట్ కాలేదని ఆ అభిమాని కామెంట్ చేశాడు. సినిమాలోని గ్రాఫిక్స్ వీడియోగేమ్ తరహాలో ఉన్నాయంటూ ఆదిపరుష్ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేశాడు. అతడి కామెంట్స్‌తో ఆగ్రహానికి గురైన ప్రభాస్ ఫ్యాన్స్ అందరిముందే ఆ యువకుడికి చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…