OTT : కరోనా వలన వచ్చిన లాక్ డౌన్ తర్వాత ఓటీటీల హవా ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీ వారు విభిన్నమైన జోనర్లలో సినిమాలు, సిరీస్ లను తీసుకు రావడంతో ప్రేక్షకులకు, సినీ లవర్స్ కు మంచి వినోదం లభిస్తుంది. దీంతో సిని ప్రియుల అభిరుచి కూడా మారడంతో వారి అభిరుచికి తగినట్లుగా సొంతంగా సినిమాలను నిర్మిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. కరోనా తగ్గి థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా ఓటీటీలో చిత్రాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ వారం పలు చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తుండగా.. ఏకంగా 19 చిత్రాల వరకు ఓటీటీలో విడుదలకు సిద్ధమైపోయాయి. అయితే వీటన్నింటిలో కొంత పెద్ద చిత్రం అంటే సార్ అని చెప్పాలి.
ధనుష్ హీరోగా నటించిన ‘సార్’లో కంటెంట్ తోపాటు సాంగ్స్ కూడా మంచిగా ఉండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కి రెడీ అవుతుంది. మార్చి 17న ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఇక సుహాస్ హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’.. జీ5లో స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. వీటితో పాటు ‘సత్తిగాని రెండెకరాలు’ లాంటి డైరెక్ట్ ఓటీటీ మూవీతోపాటు పలు వెబ్ సిరీసులు కూడా ప్రేక్షకులకి మంచి వినోదం పంచేందుకు సిద్ధమయ్యాయి. జీ 5లో చూస్తే.. జీ5: రైటర్ పద్మభూషణ్ (తెలుగు సినిమా) – మార్చి 17 , యామ్ ఐ నెక్స్ట్ (హిందీ మూవీ) – మార్చి 17, సెవెన్ (బెంగాలీ సిరీస్) – మార్చి 17న స్ట్రీమింగ్ కానుంది.
ఆహా లో లాక్డ్ చాప్టర్ 2 (తమిళ వెబ్ సిరీస్) – మార్చి 17, సత్తిగాని రెండెకరాలు (తెలుగు మూవీ) – మార్చి 17న స్ట్రీమింగ్ అవుతాయి. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పాప్ కౌన్ (హిందీ సిరీస్) – మార్చి 17న, నెట్ ఫ్లిక్స్ లో మనీ షాట్: ద పోర్న్ హబ్ స్టోరీ – మార్చి 15, కుత్తే (హిందీ మూవీ) – మార్చి 16, షాడో అండ్ బోన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 16, కాట్ ఔట్: క్రైమ్, కరప్షన్, క్రికెట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మార్చి 17, ఇన్ హిజ్ షాడో (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 17, మాస్ట్రో (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17, ద మేజీషియన్స్ ఎలిఫెంట్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 17, సార్ (తెలుగు మూవీ) – మార్చి 17న స్ట్రీమింగ్ కానున్నాయి.ఇక అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ ఆడమ్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 15, డోమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17 సోనీ లివ్ లో రాకెట్ బాయ్స్ సీజన్ 2 (వెబ్ సిరీస్) – మార్చి 16న, మనోరమ లో మోమో ఇన్ దుబాయి (మలయాళ మూవీ) – మార్చి 17న డిస్కవరీ ప్లస్ లో నేక్డ్ అండ్ ఎఫ్రైడ్: బ్రెజిల్ (పోర్చుగీస్ సిరీస్) – మార్చి 17న స్ట్రీమింగ్ అవుతాయి.