The Legend Saravanan : విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరుగడించిన అరుల్ శరవణన్ సినిమాపై తనకున్న మమకారాన్ని చాటుతూ.. వైవిధ్యమైన చిత్రాలు ప్రేక్షకులకి అందించాలని అనుకుంటున్నాడు. గత ఏడాది ది లెజెండ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం హిట్ కాకపోయినప్పటికీ ఈ సినిమా గురించి ఇండియా వైడ్ చర్చ నడిచింది. 60 నుండి 70 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవని చేయగా, ఇందులో అరుళ్ శరవణన్ లుక్, మేనరిజం పెద్ద ఎత్తున విమర్శలపాలయ్యాయి. నలబై ఏళ్ల వ్యక్తికి ఇలాంటివి అవసరమా అంటూ చాలా మంది విమర్శించారు.
‘ది లెజెండ్’ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. త్వరలోనే మరో కొత్త మూవీని ప్రకటించనున్నారు. ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. చాలా యంగ్‌గా కనిపిస్తుండంతో అందరు అవాక్కవుతున్నారు. 20 ఏళ్ల కుర్రాడిలా మారిపోయిన అరుల్ ని చూసి సోషల్ మీడియా జనాలు ఇంత యంగ్ గా ఎలా మారిపోయారని ఆయన్ని అడుగుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మొత్తంగా అరుళ్ శరవణన్ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. కొత్త చిత్రం కోసమే ఇలా లుక్ మార్చినట్లు.. త్వరలోనే అన్ని విషయాలను తెలియజేస్తానని లెజెండ్ శరవణన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.
![The Legend Saravanan : గుర్తు పట్టకుండా మారిన ది లెజెండ్ శరవణన్.. ఇంతకీ అసలు ఏం జరిగింది..? The Legend Saravanan see how is he changed](http://3.0.182.119/wp-content/uploads/2023/03/the-legend-saravanan.jpg)
కాగా, శరవణన్ నటించిన ‘ది లెజెండ్’ కొద్దిరోజుల కిందట డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఓటీటీలోకి విడుదలైన తొలి రోజే అత్యధిక వ్యూస్ సాధించిన విషయం విదితమే. ఇప్పటికే విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్న ది లెజెండ్ శరవణన్.. ఇండస్ట్రీలో కూడా గట్టిగా రాణించేందుకు కృషి చేస్తున్నాడు. అయితే తొలి సినిమాతో పూర్తిగా నిరాశపరచిన ఇతను రెండో సినిమాతో ఎలా రాణిస్తాడో చూడాలి. తమిళనాడుకు చెందిన శరవణ స్టోర్స్ యజమాని శరవణన్ అరుల్ తన రెండో సినిమాకి కూడా భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.