Mahesh Babu : మ‌హేష్ బాబు స‌రికొత్త రికార్డ్‌.. దేశంలో ఏకైక హీరోగా రికార్డ్ బ్రేక్..

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన మ‌హేష్ బాబు రీసెంట్‌గా గుంటూరు కారం అనే చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజ్‌గా నిలిచింది. ఈ మూవీ డివైడ్ టాక్‌తో దాదాపు బాక్సాఫీస్ దగ్గర 90 శాతం రికవరీ సాధించింది.   రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్డర రూ.21.19 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. ఏది ఏమైనా నెగిటివ్ టాక్‌తో గుంటూరు కారం సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. ఇక త్వ‌ర‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ చిత్రంతో మ‌హేష్ క్రేజ్ పీక్స్‌లోకి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

ఇక మ‌హేష్ సినిమాల‌తోనే కాదు యాడ్స్‌తోను బాగానే సంపాదిస్తున్నారు. ఆయ‌న‌ ఇమేజ్‌ను బట్టి  పెద్ద పెద్ద కంపెనీలు తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కోసం ఎగబడుతున్నారు.  ప్రస్తుతం తెలుగులో ఏ హీరోకు లేనన్ని బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ మహేష్ బాబు చేతిలో ఉన్నాయి. ఫోన్ పేలో మొన్న‌టి వ‌ర‌కు  అమితాబ్ బచ్చన్ వాయిస్ మాత్రమే దేశం మొత్తం వినిబడేది. తాజాగా తెలుగు ప్రజల కోసం ఫోన్ పే మహేష్‌ బాబు వాయిస్ యూజ్ చేసుకుంటోంది. రెండు సెకన్ల మహేష్ బాబు వాయిస్ కోసం దాదాపు రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ పండుగాడికి ఇచ్చినట్టు సమాచారం. ఈ యాడ్ ఎండార్సమెంట్ రెండేళ్ల పాటు ఉంటుందట.

Mahesh Babu breaks new record in advertising revenue
Mahesh Babu

మహేశ్ బాబు ఇటీవల ఫోన్ పే కోసం తన వాయిస్‌ను ఇచ్చారు. ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్‌లకు చేసిన డిజిటల్ చెల్లింపుల కోసం వాయిస్‌ని అందించిన మొదటి సౌత్ ఇండియన్ సెలబ్రిటీగా మహేష్ బాబు నిలిచారు. ఇప్పుడు అదే బాటలో మరో ఇద్దరు సూపర్ స్టార్లు నడుస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఫోన్ పే చెల్లింపుల కోసం తమ వాయిస్‌ను ఇస్తున్నట్లు సమాచారం. మమ్ముట్టి, కిచ్చా సుదీప్ కూడా దాదాపు అదే రేంజ్‌లో ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మహేష్ బాబు వాయిస్‌తో ఫోన్ పే ఇపుడు ప్రజలకు మరింత చేరువ కానుంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 weeks ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 weeks ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 weeks ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 weeks ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 weeks ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 weeks ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

4 weeks ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 weeks ago