Chandra Mohan : క‌న్నీళ్లు పెట్టిస్తున్న చంద్ర‌మోహ‌న్ చివ‌రి మాట‌లు.. వింటే ఎమోష‌న‌ల్ కావాల్సిందే..!

Chandra Mohan : సీనియ‌ర్ న‌టుడు చంద్ర‌మోహ‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న హీరోగానే కాకుండా ప‌లు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించాడు. అయిత గ‌త కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ నవంబర్ 11న ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ ఆయ‌న‌తో ఉన్న అభిమానాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం చంద్రమోహన్ చివరి మాటలు అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. చివరిసారిగా ఆయన కళాతపస్వి కె. విశ్వనాథ్ మరణించిన సమయంలో మీడియా ముందుకు వచ్చారు.అయితే ముందుగా విశ్వనాథ్ పార్థివదేహం చూసి తల్లిడిల్లిపోయారు.

విశ్వ‌నాథ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భోరున ఏడ్చేశారు చంద్ర‌బాబు. ఇండస్ట్రీలో అందరికంటే తాను కళాతపస్వికి దగ్గరివాడినని.. తన పెద్దనాన్న కుమారుడే విశ్వనాథ్ అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.“కె. విశ్వనాథ్.. స్వయానా నా పెద్దనాన్న కొడుకు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నా కజిన్. మా మధ్య సినిమా అనుబంధం కంటే కుటుంబ బాంధవ్యం ఎక్కువ. ఇండస్ట్రీలోని అందరికంటే నేను చాలా దగ్గరివాడిని.విశ్వనాథ్ అన్నయ్య, నేను మద్రాసులో ఒకే చోట స్థలం కొనుక్కోని.. అక్కడే ఇళ్లు కట్టుకుని పాతికేళ్లు పక్కపక్కనే ఉన్నాం. మా ఇద్దరి కాంబోలో ఎన్నో గర్వకారణమైన సినిమాలు వచ్చాయి. నన్ను అద్భుతమైన నటుడిగా చూపించారు.

Chandra Mohan last words you will get emotional
Chandra Mohan

మా మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఆయన మరణం మా కుటుంబాలకు తీరని లోటు. ఎప్పటికైనా అందరూ చనిపోవాల్సిందే” అంటూ భావోద్వేగానికి గురయ్యారు చంద్రమోహన్.. ఆయ‌న మాట్లాడిన మాట‌లు ప్ర‌తి ఒక్క‌రికి క‌న్నీరు పెట్టిస్తున్నాయి. ఇక చంద్ర‌మోహ‌న్ విష‌యానికి వ‌స్తే.. 1945 మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించిన ఆయన మేడూరు, బాపట్లలో చదువు పూర్తి చేశారు. చంద్రమోహన్ భార్య పేరు జలంధర. వీరికి మధుర మీనాక్షి, మాధవి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్ గా అమెరికాలో స్థిరపడగా.. మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. దాదాపు 55 ఏళ్ల సినీ ప్రయాణంలో 932 సినిమాల్లో నటించారు చంద్రమోహన్.

Share
Shreyan Ch

Recent Posts

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

Torn Currency Notes : చాలా మంది ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన కరెన్సీ నోట్లు ఉంటాయి. అవి…

3 hours ago

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

OTT Horror Web Series : ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాత‌లు…

18 hours ago

OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో హ‌ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ప్ర‌తి సినిమా కూడా వైవిధ్య‌మైన కంటెంట్‌తో…

23 hours ago

Pawan Kalyan : అన్నాలెజినోవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు.. పుకార్ల‌కి అలా పుల్‌స్టాప్ పెట్టిన ప‌వ‌న్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి…

1 day ago

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

2 days ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

2 days ago

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా…

2 days ago

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Chandra Babu : ఏపీలో ఈ సారి రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండ‌గా, టీడీపీ,…

3 days ago