Anushka Shetty : సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. ఈ అమ్మడు అరుంధతి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలి కాలంలో అనుష్క కొంత సినిమాలు తగ్గించింది అనే చెప్పాలి. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది. అనుష్క ఇటీవల బరువుకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటోంది. దీనితో అనుష్క ఎక్కువ చిత్రాల్లో నటించేందుకు వీలు కావడం లేదు. అయితే అనుష్క శెట్టి యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.
అనుష్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల యువి క్రియేషన్స్ గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ కూడా నిర్వహించారు. అయితే అనుష్కతో యువీ క్రియేషన్స్ చేయాల్సిన సినిమా ఎందుకో ఇంకా పట్టాలెక్కడం లేదు. బరువు సమస్యో, ఇతర కారణాలో తెలియవు కానీ అనుష్క అంతగా బయట ఎక్కువగా కనిపించడం లేదు. రీసెంట్గా అనుష్క బయటకు వచ్చింది. ఇంకేముంది అభిమానులు ఆమెను తమ కెమెరాల్లో బంధించేశారు. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ హంగామా చేస్తున్నారు. అసలు ఇంతకీ అనుష్క ఎందుకు వచ్చిందో తెలుసా! మంగళూరులో జరిగిన భూత కోలా వేడుకల్లో పాల్గొనటానికి అనుష్క వెళ్లింది.
![Anushka Shetty : కాంతార భూత కోలా వేడుకల్లో మెరిసిన అనుష్క శెట్టి.. చక్కర్లు కొడుతున్న వీడియో.. Anushka Shetty in kantara bhoota kola festival viral video](http://3.0.182.119/wp-content/uploads/2022/12/anushka-shetty.jpg)
దక్షిణ కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన భూత కోలా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో అనుష్క పాల్గొంది. చీర కట్టులో ఉన్న అనుష్క ఫొటోలు, వీడియోలను ఆమె అభిమానులు నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అనుష్క ఈ వేడుకల్లో పాల్గొనడంతో పాటు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను తన ఫోన్లో వీడియోల రూపంలో చిత్రీకరించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఇటీవల బాక్సాఫీస్‌ని షేక్ చేసిన కన్నడ చిత్రం కాంతార భూత కోలా నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయం సాధించిన సంగతి విదితమే.
Another glimpse of Sweety attending Boothakola Festival in her home town ❤️❤️✨✨#AnushkaShetty #Sweety #Anushka48 pic.twitter.com/XvwIXTnjha
— PRANUSHKA FANCLUB 🌸❤️ (@pranushka_fan) December 18, 2022