Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన ప్రభాస్ ఇప్పుడు తన క్రేజ్‌ని సౌత్‌కి మాత్రమే కాకుండా దేశ విదేశాలలో పెంచుకున్నాడు. కెరీర్ పరంగా ప్రభాస్ దూసుకుపోతున్న ఆయన పర్సనల్ లైఫ్ విషయంలో అభిమానులలో కొంత ఆందోళన నెలకొంది. 40 ఏళ్లు వచ్చిన కూడా ప్రభాస్ ఇంకా పెళ్లి జోలికి వెళ్లడం లేదు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియాలో కూడా.. పెళ్లికి చేసుకోడానికి రెడీ ఉన్న సెలబ్రిటీల లిస్టులో.. టాప్ లో ఉండే ప్రభాస్ రీసెంట్‌గా అన్‌స్టాపబుల్ షోకి హాజరై తన పెళ్లిపై స్పందించాడు.
బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో తన స్నేహితుడుగు గోపిచంద్‌తో కలిసి డార్లింగ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేదికపై డార్లింగ్ కు సంబంధించిన పలు విషయాలు.. సీక్రెట్స్ బయటకు తీసేందుకు బాలకృష్ణ ట్రై చేయగా.. ఆయనకు చరణ్, గోపిచంద్ ఎక్కువగానే సహకరించినట్లు ప్రోమో చూసిన వారికి అర్ధమైది. అయితే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2 లో, నందమూరి బాలకృష్ణ ప్రభాస్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడిగాడు, దానికి అతను సల్మాన్ ఖాన్ తర్వాత అని ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.
మరి సల్మాన్ పెళ్లెప్పుడు అవుతుందో, ప్రభాస్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటాడా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక ప్రభాస్ గతంలో అనుష్కతో ప్రేమలో ఉన్నాడని ప్రచారాలు జరిగాయి. ఆ తర్వాత కృతిసనన్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్లలో ఏది నిజమో ఎవరికి అర్ధం కావడం లేదు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్నఆదిపురుష్, సలార్ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ ల ఉండగా..ప్రాజెక్ట్ కె మూవీ మాత్రం నెమ్మదిగా నడుస్తుంది.. మరో వైపు సందీప్ రెడ్డితో స్పిరిట్, పట్టాలెక్కాల్సి ఉంది. మారుతీ డైరెక్షన్ లె డీలక్స్ రాజా షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. మరికొన్ని కథలు ప్రభాస్ హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది.