హిందువులు ఏ శుభకార్యం చేసినా.. పూజ చేసినా ముందుగా గణపతినే పూజిస్తారు. ఎందుకంటే ఆయన విఘ్నేశ్వరుడు. కనుక విఘ్నాలు కలగకుండా చూస్తాడు. మనం తలపెట్టే పని విజయవంతంగా పూర్తి కావాలని ముందుగా గణపతికే పూజ చేస్తారు. అలా పూజ చేసేలా ఆయనకు వరం ఉంటుంది. అయితే వివిధ రకాల రూపాల్లో ఉండే గణపతిని పూజిస్తే భిన్న ఫలితాలు కలుగుతాయి. ఏయే రూపాల్లో ఉండే గణపతిని పూజిస్తే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హరిద్ర గణపతిని పూజగదిలో పెట్టుకుని పూజిస్తే ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి. పసుపు గణపతి లేక హరిద్ర గణపతి పూజ వల్ల దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మ రోగాలు నయం అవుతాయి. పసుపు గణపతి పూజతోపాటు గౌరీ దేవీని పూజించటం ద్వారా ఇంట్లో వుండే వధువుకు లేక వరుడికి ఉండే వివాహ దోషాలు తొలగిపోతాయి. వివాహం నిశ్చయం అవుతుంది. హరిద్ర గణపతిని పూజిస్తే డబ్బు సమస్య రాదు అప్పుల బాధ తొలగిపోతుంది. కామెర్లు ఉన్నవారు హరిద్ర గణపతిని దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది. దుకాణల్లో చాలా రోజులుగా అమ్ముడు పోకుండా మిగిలిఉండే వస్తువులపై హరిద్ర గణపతిని తాకిస్తే వెంటనే ఆ వస్తువులు విక్రయించబడతాయి. వ్యాపారం బాగా కొనసాగుతుంది.
పగడపు గణపతిని పూజించటం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నర దిష్టి కలగకుండా కాపాడుతుంది. ఇంటిలో, వ్యాపార సంస్ధలలో తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నవారు, రుణ విముక్తి కోసం.. పగడపు గణపతిని పూజించాలి. దీంతో అన్ని సమస్యలు పోతాయి. అలాగే మరకత గణపతిని పూజించడం ద్వారా తెలివితేటలు పెరుగుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వ్యాపారం అభివృద్ధి పథంలో నడుస్తుంది. గుండె జబ్బులు, ప్రసరణ వ్యవస్థలో లోపాలు, ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకోవడం వంటివి జరుగుతాయి. శరీరంలో ప్రాణ శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. డబ్బు వృథాగా ఖర్చు కాదు.
ఉద్యోగంలో ఉన్నతి, సంఘంలో గౌరవం కోసం చందన గణపతిని పూజించాలి. భార్యాపుత్రులతో సుఖజీవనం, వృత్తి, ఉద్యోగాలలో తగాదాలు లేకుండా ఉండడానికి స్ఫటిక గణపతిని పూజించాలి. వెండి గణపతిని పూజించినా ఇదే ఫలితం వస్తుంది. అధిక శ్రమ నుంచి విముక్తి, శ్రమకు తగిన ఫలితం దక్కడానికి నల్లరాయితో చేసిన గణపతిని పూజించాలి. అంతేకాకుండా వీధి శూల నివారణకి కూడా నల్ల రాతి వినాయక విగ్రహాలనే వాడడం మంచిది.
శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్య్ర బాధలు ఉండవు. శ్వేతార్క మూలానికి వశీకరణశక్తి ఉంటుంది. నరుల దిష్టి తగలకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలో, వ్యాపార సంస్ధలలో తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే శ్వేతార్క వేరుని తాయత్తులో ధరించడం వల్ల అంతా మేలే జరుగుతుంది. ఇలా భిన్న రూపాల్లో ఉండే గణపతిని పూజిస్తే భిన్న రకాల ఫలితాలను పొందవచ్చు. అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…