Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆధ్యాత్మికం

ఏ రూపంలో ఉన్న గ‌ణ‌ప‌తిని పూజిస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

editor by editor
July 27, 2022
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

హిందువులు ఏ శుభ‌కార్యం చేసినా.. పూజ చేసినా ముందుగా గ‌ణ‌ప‌తినే పూజిస్తారు. ఎందుకంటే ఆయ‌న విఘ్నేశ్వ‌రుడు. క‌నుక విఘ్నాలు క‌ల‌గ‌కుండా చూస్తాడు. మ‌నం త‌ల‌పెట్టే ప‌ని విజ‌య‌వంతంగా పూర్తి కావాల‌ని ముందుగా గ‌ణ‌ప‌తికే పూజ చేస్తారు. అలా పూజ చేసేలా ఆయ‌న‌కు వ‌రం ఉంటుంది. అయితే వివిధ ర‌కాల రూపాల్లో ఉండే గ‌ణ‌ప‌తిని పూజిస్తే భిన్న ఫ‌లితాలు క‌లుగుతాయి. ఏయే రూపాల్లో ఉండే గ‌ణ‌ప‌తిని పూజిస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హరిద్ర గణపతిని పూజగదిలో పెట్టుకుని పూజిస్తే ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి. పసుపు గణపతి లేక హరిద్ర గణపతి పూజ వల్ల‌ దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మ రోగాలు నయం అవుతాయి. పసుపు గణపతి పూజతోపాటు గౌరీ దేవీని పూజించటం ద్వారా ఇంట్లో వుండే వధువుకు లేక వరుడికి ఉండే వివాహ దోషాలు తొలగిపోతాయి. వివాహం నిశ్చయం అవుతుంది. హరిద్ర గణపతిని పూజిస్తే డబ్బు సమస్య రాదు అప్పుల బాధ తొలగిపోతుంది. కామెర్లు ఉన్నవారు హరిద్ర గణపతిని దానంగా ఇస్తే కామెర్ల రోగం తొల‌గిపోతుంది. దుకాణల్లో చాలా రోజులుగా అమ్ముడు పోకుండా మిగిలిఉండే వస్తువులపై హరిద్ర గణపతిని తాకిస్తే వెంటనే ఆ వ‌స్తువులు విక్ర‌యించ‌బ‌డ‌తాయి. వ్యాపారం బాగా కొన‌సాగుతుంది.

perform pooja for different types of ganesha for health and wealth

పగడపు గణపతిని పూజించటం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నర‌ దిష్టి కలగకుండా కాపాడుతుంది. ఇంటిలో, వ్యాపార సంస్ధలలో తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచూ అనారోగ్య సమస్యల బారిన ప‌డుతున్న‌వారు, రుణ విముక్తి కోసం.. పగడపు గణపతిని పూజించాలి. దీంతో అన్ని స‌మ‌స్య‌లు పోతాయి. అలాగే మరకత గణపతిని పూజించడం ద్వారా తెలివితేటలు పెరుగుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వ్యాపారం అభివృద్ధి పథంలో నడుస్తుంది. గుండె జబ్బులు, ప్రసరణ వ్యవస్థలో లోపాలు, ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకోవడం వంటివి జ‌రుగుతాయి. శరీరంలో ప్రాణ శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగు ప‌డుతుంది. డ‌బ్బు వృథాగా ఖ‌ర్చు కాదు.

ఉద్యోగంలో ఉన్నతి, సంఘంలో గౌరవం కోసం చందన గణపతిని పూజించాలి. భార్యాపుత్రులతో సుఖజీవనం, వృత్తి, ఉద్యోగాలలో తగాదాలు లేకుండా ఉండడానికి స్ఫ‌టిక గణపతిని పూజించాలి. వెండి గణపతిని పూజించినా ఇదే ఫలితం వస్తుంది. అధిక శ్రమ నుంచి విముక్తి, శ్రమకు తగిన ఫలితం దక్కడానికి నల్లరాయితో చేసిన గణపతిని పూజించాలి. అంతేకాకుండా వీధి శూల నివారణకి కూడా నల్ల రాతి వినాయక విగ్రహాలనే వాడడం మంచిది.

శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్య్ర బాధలు ఉండవు. శ్వేతార్క మూలానికి వశీకరణశక్తి ఉంటుంది. నరుల దిష్టి త‌గ‌ల‌కుండా ఇది కాపాడుతుంది. ఇంటిలో, వ్యాపార సంస్ధలలో తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచూ అనారోగ్య సమస్యలు వ‌స్తున్న‌వారు శ్వేతార్క గణపతిని పూజించటం వ‌ల్ల మంచి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. అలాగే శ్వేతార్క వేరుని తాయ‌త్తులో ధరించడం వ‌ల్ల అంతా మేలే జ‌రుగుతుంది. ఇలా భిన్న రూపాల్లో ఉండే గ‌ణ‌ప‌తిని పూజిస్తే భిన్న ర‌కాల ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అన్ని ర‌కాల స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

Tags: lord ganesha
Previous Post

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Next Post

అద్భుత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన మ‌ణిర‌త్నం.. ఆయ‌న వ‌రుస ఫ్లాప్‌ల‌కు కార‌ణం అదేనా..?

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
వార్త‌లు

Amani : రేయ్ అఖిల్‌.. అమ్మ‌ని రా.. గుర్తు ప‌ట్టావా.. అఖిల్ ఏమ‌న్నాడో చూడండి..!

by Shreyan Ch
February 26, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Tamarind Seeds : అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించే చింత గింజ‌లు.. న‌రాల బ‌ల‌హీన‌త‌కు ఉత్త‌మ‌మైన ఔష‌ధం..

by editor
October 1, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.