టాలీవుడ్లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను పెంచుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవల బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ మూవీ సక్సెస్ అనంతరం కళ్యాణ్ రామ్ డెబ్యూ డైరెక్టర్ రాజేందర్ రెడ్డితో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మేకర్స్ సోమవారం రోజున అమిగోస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేసే హీరో కళ్యాణ్ రామ్ నటిస్తోన్న ఈ సినిమా టైటిల్ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో అందరిలో ఆసక్తిని పెంచారు.
అమిగోస్ నిర్మాణం ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. అమిగోస్ అనేది స్పానిష్ పదం. ఈ టైటిల్ అనౌన్స్ చేయటంతో పాటు స్టైలిష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా కాన్సెప్ట్ ఏంటనే విషయాన్ని సూచిస్తుంది. కళ్యాణ్ రామ్ పాత్ర 3 షేడ్స్‌లో ఉంటుందనే విషయాన్ని ఈ పోస్టర్ ఎలివేట్ చేస్తుంది. నీలాగే కనపడే ఇంకో వ్యక్తి నీకు ఎదురుపడితే నువ్వు చస్తావు అనేది పోస్టర్‌పై క్యాప్షన్‌గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక స్టోరీ లైన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. హీరో తనలా పోలి ఉన్న మనుషులు ఎంతమంది ఉన్నారు? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకు ఒక యాప్‌ని వినియోగిస్తాడట.
అయితే అతనికి మరో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వారిలో ఒక వ్యక్తికి 6 వేళ్లు ఉంటాయి. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు మాత్రం నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తట. అంటే అతని వల్ల మిగిలిన ఇద్దరికీ ఏదైనా ప్రమాదం జరగడం లేదా మిగిలిన వాళ్ల స్థానాలను అతను ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఒకరకంగా మూవీ కాప్షన్ చూసుకున్నా కూడా కథలో జరిగేది అదే అని అర్థమవుతుంది. అయితే ఈ స్టోరీ లైన్ ఇప్పటిది కాదు. ట్విట్టర్లో డిసెంబర్ 31, 2021లోనే ఈ స్టోరీలైన్ లీకైంది. అప్పటి నుంచి ప్లాన్ చేసి ఇప్పుడు 2023, ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నారనమాట. చూడాలి దీంతో కళ్యాణ్ రామ్ మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడో లేదో.