మనదేశంలో ఎక్కడైన టూర్ వేయాలని అనుకుంటే అందులో గోవా తప్పని సరిగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాచిలర్స్ గోవాలో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. గోవా పర్యాటకులకు ఫేవరేట్ స్పాట్. కాగా, ఇక్కడి బీచ్‌లే కాదు.. షాపింగ్, డైనింగ్ కోసమూ చాలా మంది వెళ్లుతుంటారు. రకరకాల రుచులు ముఖ్యంగా డ్రింక్‌లపై ఇష్టాలతో అక్కడి ఎక్కువగా వెళ్లుతుంటారు. అక్కడి లోకల్ రుచులను ఆస్వాదించాలని ఉత్సాహం కూడా చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల చాలా మంది అక్కడి ఓల్డ్ మంక్ టీని ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
టీ అమ్మమే వ్యక్తి టీలో ఓల్డ్ మంక్ రమ్ పోసి అమ్ముతున్నాడు. ఈ ఓల్డ్ మంక్ టీ గోవాలోని సింక్వేరియమ్ బీచ్ దగ్గర ఉంది . నిప్పులో నుంచి టీ కప్ తీసి అందులో తొలుత కొంత బెల్లపు పౌడర్ యాడ్ చేశాడు. ఆ తర్వాత అందులో ఓల్డ్ మంక్ రమ్ కొద్దిగా యాడ్ చేశాడు. ఇక సాధారణ తందూరీ టీ చేసినట్టుగానే మిగతా వస్తువులు కూడా అందులో యాడ్ చేసి చివరకి కస్టమర్‌కి అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్టు చేయగా, కొద్ది క్షణాలలో వైరల్ అయింది.
సాధారణంగా మనకు మసాలా టీ , గ్రీన్ టీ , లెమన్ టీ, గ్రాస్ టీ, జింజర్ టీ వంటివి తెలుసు. ఇటీవల ఇలా చాలా రకాల టీ రుచులు వచ్చాయి. చివరికి ఈమధ్య తందూరీ టీ కూడా వచ్చేసింది. కాని ఇప్పుడు ఓల్డ్ మంక్ టీ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాండోలిమ్ లో ఉన్న సింక్వేరియమ్ బీచ్ కు వెళ్తే ఈ టీ తాగొచ్చు. అయితే ట్రెడిషనల్ చాయ్ ను ఇలా బ్రష్టుపట్టించడం సమంజసం కాదని కొందరు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
Old monk tea in Goa. The end is near!!! 🙉 pic.twitter.com/1AYI0ikR40
— Dr V 🦷💉 (@justadentist32) November 3, 2022