Venu Swamy : సినీ, రాజకీయ ప్రముఖుల జోతిష్యాలను చెప్పే ఆస్ట్రాలజర్ వేణు స్వామి సమంత, నాగ చైతన్యలువిడిపోతారని చెప్పడం వారు విడిపోవడంతో తెగ పాపులర్ అయ్యాడు. రష్మిక జాతకం గురించి మాట్లాడిన ఆయన ఆమె ఎంపీ అవుతుందని కూడా చెప్పాడు. ఆయన మాటల వలనే రష్మిక ఫస్ట్ లవ్‌కి బ్రేకప్ చెప్పిందని కూడా అన్నాడు. ఇక టాలీవుడ్‌లో మంచి జాతకం ఉన్న హీరో అల్లు అర్జున్. రాబోయే ఐదేళ్లలో ఆయన జాతకంలో ఎలాంటి మార్పులుండవు. ఆయన తీసే సినిమాలు పాన్ ఇండియా లెవల్లో తక్కువలో తక్కువగా రెండు వందల కోట్ల రూపాయల బిజినెస్‌నే చేస్తాయి.
రాసి పెట్టుకోండి. ఆయన చేసే ప్రతి సినిమా రెండు వందల కోట్లను దాటుతుందే తప్ప.. తగ్గదు. ఆయనే ఇప్పుడు బంగారు బాతు. అలాగే ఇద్దరు స్టార్ హీరోస్‌లో ఒకరికి ఆరోగ్యపరమైన సమస్యలతో సినిమా ఆగిపోయే అవకాశం ఉంది’’ అంటూ ఆ మధ్య పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, స్టార్ హీరోయిన్ సమంత మరణిస్తారని వారి జాతకంలో అలా ఉందని వేణు స్వామి కామెంట్ చేశాడు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు టెన్షన్ పడుతున్నారు.
సమంత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తనకు కొన్ని నెలల క్రితం మయోసైటిస్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ వ్యాధి నిర్ధరణ అయినట్లు సమంత శనివారం తెలిపారు. త్వరలోనే ఈ వ్యాధి నుంచి కోలుకుంటానని, ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు సమంత చెప్పారు. ఈమె ఈ విషయం ప్రకటించగానే వేణు స్వామి చెప్పిన మాటలు సమంత అభిమానుల మైండ్ బ్లాక్ చేశాయి. సమంత త్వరగా కోలుకోవాలని అందరు ప్రార్ధిస్తున్నారు.