Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్‌గా పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పింది. మయోసిటిస్ అనే ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్న సమంత ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే తన తదుపరి సినిమాలతో బిజీగా మారిపోయింది. యశోద సినిమాకి డబ్బింగ్ చెబుతున్న సమంత త్వరలోనే ఆ వ్యాధి నుండి కోలుకొని షూటింగ్స్ లో కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సమంత ఆ వ్యాధి నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలని మళ్లీ పూర్తిస్థాయిలో ఆరోగ్యంతో ఆమె షూటింగ్స్ లో పాల్గొనాలి అని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ అలాగే మరి కొంతమంది హీరోలు కూడా సమంత కోలుకోవాలని ట్వీట్ చేశారు. అక్కినేని హీరో అఖిల్ కూడా సమంత ఆరోగ్య విషయంపై స్పందించిన విషయం తెలిసిందే.
నాగ చైతన్య మాత్ర ఇప్పటి వరకు సమంత ఆరోగ్యంపై స్పందించలేదు. అయితే సమంత అనారోగ్యానికి గురైన సమయంలో వీరి విడాకుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సమంతకు ఎప్పటి నుండో పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఆ కారణం వల్లనే నాగ చైతన్య విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నాడని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఏ మాత్రం లేదంటూ మరి కొందరు కొట్టి పారేస్తున్నారు.కాగా, టాలీవుడ్లో కొంత కాలంగా హాట్ టాపిక్‌గా మరిన విషయం నాగ చైతన్య, సమంత విడాకులు. ఈ విషయంపై చాలా కాలంగా వార్తలు రాగా.. గత ఏడాది అధికారికంగా విడాకుల గురించి ప్రకటించారు.
కారణం చెప్పకున్నా.. తాము వేర్వేరు మార్గాల్లో ప్రయాణించనున్నట్లు తెలిపారు. ఇకపై భార్య, భర్తలుగా కొనసాగలేమని.. విడిపోయి మంచి స్నేహితులుగా కలిసి ఉంటామని చెప్పారు. అయితే సమంత, నాగ చైతన్య విడిపోయి నెలలు గడుస్తున్నాయి. ఎవరి బిజీ లైఫ్ లో వారు ఉన్నారు. కానీ చైతు, సమంత గురించి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. నాగ చైతన్య రీసెంట్ గా థాంక్యూ అనే చిత్రంలో నటించాడు. సమంత పలు చిత్రాల్లో నటిస్తోంది. రీసెంట్ గా సామ్ కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో పాల్గొంది. సమంత తొలిసారి ఈ షోలో తన డివోర్స్ గురించి మాట్లాడింది.