Raj Tarun : యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరియర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఒకప్పుడు మంచి సినిమాలతో అలరించిన ఇప్పుడు మాత్రం హిట్ కోసం పరితపిస్తున్నాడు. మరోవైపు సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ అలరిస్తున్నాడు. అయితే తాజాగా రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం… లావణ్యతో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో లావణ్యను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు.
ఈ కారణంగా లావణ్యను దూరం పెడుతున్నాడు. తన వెంటపడొద్దని, వదిలేయకపోతే చంపి… శవం మాయం చేస్తానని బెదిరించాడు. గతంలో లావణ్యను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ కేసులో ఇరికించాడు. ఈ కేసులో లావణ్య 45 రోజులు జైల్లో ఉంది. అప్పుడు కూడా రాజ్ తరుణ్ ఆమెకు ఎలాంటి సహాయం చేయలేదు. నాకు రాజ్ తరుణ్ కావాలి అంటున్న లావణ్య… న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ల లో ఆమె కేసు ఫైల్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడేళ్లగా లావణ్యతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే. అయితే ఆమె అలవాట్లు నచ్చక దూరం పెట్టాను. ఆమె డ్రగ్స్‌కు ఎడిక్ట్ అయింది. మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. ఎన్నోసార్లు చెప్పి చూశాను. నా మాట వినకుండా నాకైతే టార్చర్ చూపిస్తోంది. అవన్నీ తట్టుకోలేకే ఆమెకు దూరంగా ఉంటున్నా. రిలేషన్ కు స్వస్తి చెప్పాను.
అయితే ఆమె నన్ను బెదిరిస్తుంది.. నాతో డైరెక్ట్‌గా మాట్లాడకుండా నా చుట్టూ ఉన్న స్నేహితులను ఇబ్బంది పెడుతుంది. కేసు పెడతానని బెదిరిస్తోంది. దాంతో నేను లీగల్‌గా వెళ్లాలనుకుంటున్న విషయం తెలుసుకుని నాపై కేసు పెట్టింది. త్వరలో సినిమా రిలీజ్‌కు ఉండడంతో ఈ సినిమాను దెబ్బ తీయాలనే ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది. లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందనే విషయాన్ని ఒక బాధ్యతగ గల హీరోగా నేను పోలీసులకు చెప్పాల్సింది. కానీ నేను నా రిప్యుటేషన్ పోతుందని ఆలోచించి ఆ దిశగా అడుగేయలేదు. ఎలాంటి రచ్చ జరుగుతోందోనని భయపడ్డాను. ఆమెను పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుందని మనసులో ఉండేది. కానీ నేను ఎప్పుడు ఆ మాట ఆమెతో చెప్పలేదు. బంధం బలపడుతున్న సమయంలో డ్రగ్స్ , వేరే వ్యక్తితో రిలేషన్ తో పాటు చాలా కారణాల వల్ల నేను ఆమెకు దూరమయ్యానంటూ రాజ్ తరుణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.