Bandla Ganesh : ‘గబ్బర్ సింగ్’ మూవీతో స్టార్ ప్రొడ్యూసర్‌గా మారిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడిగా కెరీర్‌ని మొదలు పెట్టిన బండ్ల గణేష్ నిర్మాతగా సత్తా చాటుతున్నాడు. అయితే గబ్బర్ సింగ్ తర్వాత ఆ ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయారు. ఆ తర్వాత స్టార్ హీరోలపై చేసిన ఓపెన్ కామెంట్స్ వల్ల నిర్మాతగా చాన్స్‌లు పోగొట్టుకున్నారు. ఇక తరచూ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్‌లో ఎనర్జిటిక్ స్పీచ్‌లతో ఊగిపోయే బండ్లన్నకు ఇప్పుడు ఆ ఆహ్వానాలు కూడా అందడం లేదు.తను పవన్ కళ్యాణ్‌కి దూరం కావడం వెనక త్రివిక్రమ్ అనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతుంది.
ప్రతిసారి గురూజీ పేరుతో త్రివిక్రమ్‌పై ట్వీట్లు చేయడం బండ్లన్నకు అలవాటే. గురు పౌర్ణమి సందర్భంగా కూడా తాను గురువుగా భావించే పవన్ కళ్యాణ్‌కు విషెస్ తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు బండ్ల. ఇక మీదట ఆయనకు దూరంగా ఉంటానని గురుసాక్షిగా తెలిపారు. ఏ విధంగా మీ కీర్తిని గానీ మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించననీ.. వీలైతే మీకు సహాయంగా ఉంటాను, లేకపోతే దూరంగా ఉంటాను. అంతేగాని మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందనని, గురు పౌర్ణమి సందర్భంగా గురువు సాక్షిగా చెప్తున్నాను. మీరు అనుకున్న ఆశయాన్ని సాధించాలి, సాధిస్తారు. నిస్వార్ధమైన మీ మనసులాగే మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ.. మీ బండ్ల గణేష్’ అంటూ పవన్‌కు నమస్కరించారు.
బండ్ల గణేష్ ప్రస్తుతం ఓ పెద్ద సినిమాను చేయాలని చూస్తున్నాడు. కానీ సరైన కాంబో దొరకడం లేదనిపిస్తుంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని చూశాడు. కానీ త్రివిక్రమ్ అడ్డు పడ్డట్టుగా ఉంది. అందుకే త్రివిక్రమ్ మీద అగ్గిమీదగుగ్గిలంలా ఫైర్ అవుతుంటాడు బండ్ల గణేష్. గురూజీ అంటూ ఎప్పుడూ ట్రోల్ చేస్తుంటాడు. తాజాగా ఓ ఇంటర్యూలో కూడా త్రివిక్రమ్ మీద సీరియస్ అయ్యాడు బండ్ల. గతంలో ఓసారి పవన్ కళ్యాణ్ పై తాను అలిగినట్టు చెప్పిన బండ్ల.. త్రివిక్రమే కలిపాడని అన్నారు.