Ambati Rambabu : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల మల్టీ స్టారర్ బ్రో చిత్రం రాజకీయాలలో కూడా ప్రకంపనలు పుట్టిస్తుంది. సినిమాలో అంబటి రాంబాబుని కించపరిచేలా ఓ సన్నివేశం పెట్టడంతో ఇప్పుడు వైసీపీ నాయకులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. అంబటి రాంబాబు కూడా ఈ ఇష్యూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రో టీం మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం సక్సెస్ టూర్ నిర్వహిస్తూ.. పలు ప్రాంతాల్లో సందడి చేస్తోంది. ఈ క్రమంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో సాయి ధరమ్ తేజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ పక్కన నటించడంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తేజ్ అన్నారు. త్రివక్రమ్ వల్లే ఈ అవకాశం వచ్చిందని.. త్రివిక్రమ్, పవన్ లాంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత తనకు లేదన్నారు.
బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబుపై అంశంపై తేజ్ స్పందించారు. మంత్రిపై జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్ తీయలేదని తెలిపారు. తనకు రాజకీయ అనుభవం లేదని.. సినిమా, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని కోరారు. అయితే తమ కుటుంబ సభ్యులంతా పవన్ కళ్యాణ్‌తోనే ఉంటామని తేజ్ స్పష్టం చేశారు. అంబటి రాంబాబు మీద జోకులు వేసే విధంగా తమ సినిమాలో డ్యాన్స్ సీన్ తీయలేదని తేజూ చెప్పాడు. సినిమాలకు, రాజకీయాలకు ముడిపెట్టవద్దని చెప్పాడు. సినిమాను సినిమాగానే చూడాలని అన్నారు. పెద్ద మామయ్య చిరంజీవితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు.
బ్రో సినిమాలో తన డ్యాన్స్పై సీన్ పై అంబటి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తన మీద కోపం ఉంటే రాజకీయంగా మాట్లాడాలి కానీ సినిమాలో క్యారెక్టర్ పెట్టి ఆనందపడడాన్ని శునకానందం అంటారని మండిపడ్డారు. కాగా బ్రో సినిమా.. మూడేళ్ల క్రితం విడుదలైన వినోదయ సిత్తం అనే తమిళ చిత్రానికి ఇది రిమేక్. అయితే పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్లో చాలా మార్పులు చేశారు.ఈ మూవీని సముద్రఖని డైరెక్ట్ చేయగా.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించారు. కేతికా శర్మ హీరోయిన్గా నటించగా.. థమన్ సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం ఈ మూవీ మోస్తరు కలెక్షన్లతో దూసుకెళ్తోంది.