Naresh Allari Movie : అల్లరి సిినిమాని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు నరేష్. అప్పట్లో టాప్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న ఇవివి సత్యనారాయణ గారి కొడుకు గా అల్లరి సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్… 2002 వ సంవత్సరంలో రవిబాబు దర్శకత్వంలో రూపొందిన ‘అల్లరి’ చిత్రంతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. 2002 మే 10 న ఈ చిత్రం రిలీజ్ కాగా, ఈ ఏడాది మే 10తో 21 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా మూవీకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అల్లరి చిత్రాన్ని రవిబాబు ‘ఫ్లైయింగ్ ఫ్రాగ్స్’ అనే బ్యానర్ ను స్థాపించి ఓ చిన్న సినిమాగా తీయాలనుకున్నారట.ముందుగా ఈ లైన్ ను తన స్నేహితుడు సురేష్ బాబుకి వినిపించాడు.అయితే ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై పెద్ద సినిమాలు నిర్మిస్తున్నారు.
ఆ టైంలో చిన్న సినిమా ఎందుకా అని సురేష్ బాబు ఆలోచించారు.అయినప్పటికీ రవిబాబు కాన్ఫిడెన్స్ పై నమ్మకంతో రవిబాబుకి సపోర్ట్ ఇచ్చి ‘ఫ్లైయింగ్ ఫ్రాగ్స్’ అనే బ్యానర్ ను స్థాపించేలా చేశారు… మొదటి సినిమాకే నిర్మాణ రంగంలోకి వెళ్లడం కరెక్టేనా అనే ఆలోచన రాగా, అదే విషయాన్ని తన తండ్రి చలపతి రావుకి చెప్పాడు రవిబాబు. అప్పుడు మన సినిమా ఎవ్వడూ కొనడు .కాబట్టి మనం సురేష్ బాబు, రామానాయుడు ల సపోర్ట్ తీసుకుని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్టర్ ను వాడుకుందాం అని చెప్పారట. తండ్రి మాటలతో రవిబాబు కూడా కన్విన్స్ అయ్యాడు. అప్పుడు సురేష్ బాబు..రవిబాబుకి ఒక సలహా కూడా ఇచ్చాడు. సినిమాని నువ్వు డైరెక్టర్ గా మాత్రమే చేస్తే సరిపోదు.. నువ్వు నిర్మాణ భాగస్వామిగా ఫీలయ్యి చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని అన్నాడట.

ఇక ఇవివి సత్యనారాయణ వద్ద రవిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో రవిబాబుకి, అల్లరి నరేష్ కు ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఆ క్రమంలో నరేష్ హీరోగా సినిమా తీయాలని అనుకున్నాడు రవిబాబు. నిజానికి నరేష్ కు హీరోగా కన్నా డైరెక్టర్ అవ్వాలని ఉండేదట. అయితే ఏదోలా రవిబాబు ఇవివి,నరేష్‌ని ఒప్పించడం జరిగింది. అయితే సినిమా నిండా కొత్త మొహాలే ఉంటే.. మార్కెట్ చేసుకోడానికి ఇబ్బంది అవుతుందేమో ఆలోచించుకోండి అన్నారట. అయినా రవిబాబు భయపడకుండా 25 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 70 లక్షలు కాగా ఈ సినిమా ను మొదట కొనడానికి ఎవరు రాలేదు . దాంతో సురేష్ బాబు దగ్గర ఉన్న కొన్ని థియేటర్లలో రిలీజ్ చేయడంతో పాజిటివ్ టాక్ సంపాదించుకొని మంచి విజయాన్ని సాధించింది.ఆరోజుల్లోనే ఈ సినిమా సురేష్ బాబు కి 2 కోట్ల ప్రాఫిట్ కూడా అందించింది.