Venkatesh : సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారుతుంటాయి. ఒకరి చేతుల్లోకి వచ్చిన ప్రాజెక్ట్ మరొకరి చేతుల్లోకి వెళ్లడం ఒక్కోసారి అది సూపర్ హిట్ కావడం, మరో సారి ఫ్లాప్ కావడం కూడా జరుగుతుంది. సాదారణంగా దర్శకుడు, రైటర్ ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తారు..అది కాస్తా యూ టర్న్ తీసుకుని మరో హీరో దగ్గరికి వెళ్లడంతో మళ్లీ కొంత మార్పులు చేయాల్సిన పరిస్థితి. అయితే ఒకరి నుండి మరొకరి దగ్గరకు వెళ్లి ఈ మధ్య ఫెయిల్యూర్స్ గా నిలిచిన రెండు చిత్రాలు రాధేశ్యామ్, ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ రెండు సినిమాలు ముందుగా వెంకటేష్ చేయాల్సిందట.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాగా, ఈ సినిమా తీవ్రంగా నిరాశపరచింది. ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా నటించిన విషయంతెలిసిందే. ఈ చిత్ర కథ రాసింది దర్శకుడు రాధాకృష్ణ కాదట. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ కథని రాసుకున్నారట. చంద్రశేఖర్ ఏలేటి ముందుగా ఈ కథని హస్తసాముద్రిక నిపుణుడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అని కథ రాసుకోగా దీనిని ముందుగా వెంకటేష్‌కి వనిపించారట.సెకండ్ హాఫ్ నచ్చలేదని వెంకీ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో చంద్రశేఖర్ యేలేటికి కూడా ఈ కథపై ఆసక్తి పోయిందట. దీనితో ఈ కథని ఆయన అమ్మేశారు.

అప్పేడు అది దర్శకుడు రాధాకృష్ణ చేతుల్లోకి వచ్చింది. రాధాకృష్ణ ఈ కథకు మరిన్ని మార్పులు చేర్పులు చేసి రొమాంటిక్ పార్ట్ పెంచారు. ప్రభాస్ కి తగ్గట్లుగా స్టోరీని బిల్డ్ చేశారట. అలా రాధే శ్యామ్ కథ రూపు దిద్దుకున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ కిశోర్ తిరుమల ముందుగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను వెంకటేశ్‌తో చేయాలని ఫిక్సై..ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా షురూ చేశాడట. కానీ అనుకోని కారణాల వల్ల వెంకీ తప్పుకోవడంతో శర్వానంద్‌ను లైన్ లోకి తీసుకున్నట్టు టాక్. ఏదేమైన వెంకీ రెండు ఫ్లాపుల నుండి బయటపడ్డాడు.