Cow : మనిషి మాత్రమే కాదు.. ప్రేమను చూపిస్తే.. ఇతర జీవులు సైతం అంతే ఎమెషనల్‌గా మనకు కనెక్ట్ అవుతాయి. పెట్ యానిమల్స్, ఆవులు, ఇతర జీవాలు సైతం తమను ప్రేమగా చూసుకునే యజమానుల పట్ల అంతే ఆప్యాయతను ప్రదర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ఆవు మూగ వేదన అందర్నీ కన్నీళ్లు పెట్టించింది. సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన పోతురాజు సత్యనారాయణమూర్తి అనే వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఆ సమయంలో పొలం నుంచి వచ్చిన ఆవు.. యజమాని సత్యనారాయణమూర్తి మృత దేహం దగ్గరికి వచ్చి విలపించింది.
ఆ ఆవు అరగంట పాటూ యజమాని మృతదేహం దగ్గరే గట్టిగా అరుస్తూ తన బాధను వ్యక్తపరిచింది. దీంతో కుటుంబ సభ్యులను, బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచింది. రక్త సంబంధీకులపైనే ప్రేమ లేని ఈ పరిస్థితులలో ఒక ఆవు ఇలా ప్రవర్తించడం అందరిని ఆశ్చర్యపరచింది. . ఆస్తి కోసం ఒకర్ని.. ఒకరు చంపుకునే పరిస్థితి ఉంది. అలాంటిది ఓ మూగ జీవి యజమానిపై చూపిన ప్రేమను స్థానికులు కొనియాడుతున్నారు. ఆ ఆవును.. చిన్నప్పటి నుంచి సత్యనారాయణ మూర్తి కన్న బిడ్డ వలె సాకాడని.. అందుకే అది అంతగా వేదనకు గురైందని స్థానికులు చెప్పుకొచ్చారు.
![Cow : యజమాని మృతితో పరుగున వచ్చేసిన ఆవు.. ఏం చేసిందంటే..! what this cow did after its owners death](http://3.0.182.119/wp-content/uploads/2023/11/cow.jpg)
అసలు ఆవుకు తన యజమాని ఎలా తెలిసిందో కానీ, పొలంలో ఉన్న ఆవు పరుగు పరుగున యజమాని ఇంటికి వచ్చింది. గట్టిగా అరుస్తూ యజమాని మృత దేహం వద్దే తిరుగాడింది. ఈ ఘటన కుటుంబ సభ్యులను,బంధువులను కన్నీటి పర్యంతం చేసింది. మూగజీవికి యజమాని పట్ల ఉన్న అభిమానానికి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రేమాభిమానాలు మనుషుల్లేనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ ఉంటాయని, తమకూ మనసు ఉంటుందని ఈ ఆవు నిరూపించింది.