Nepal VS Mangolia Highlights : ఆసియా క్రీడల్లో నేపాల్ స‌రికొత్త చ‌రిత్ర‌.. 20 ఓవ‌ర్ల‌లో 314 ప‌రుగులు చేసిన ప‌సికూన‌..

Nepal VS Mangolia Highlights : ప‌సికూన అనుకున్న నేపాల్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. మంగోలియాపై 20 ఓవ‌ర్ల‌లో 314 ప‌రుగులు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి నేపాల్‌ 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది.అంతర్జాతీయ టీ20లలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.2019లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అఫ్గన్‌ 3 వికెట్లు నష్టపోయి 278 పరుగులు చేసింది. అయితే తాజాగా జ‌రిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన మంగోలియా నేపాల్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఓపెనర్లు కుశాల్‌ భుర్తేల్‌ 19, వికెట్‌ కీపర్‌ ఆసిఫ్‌ షేక్‌ 16 పరుగులకే అవుట్‌ కావడంతో ఆరంభంలోనే నేపాల్‌కు భారీ షాక్‌ తగిలింది. అయితే, వన్‌డౌన్‌లో కుశాల్‌ మల్లా దిగగానే సీన్‌ రివర్స్‌ అయింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపిస్తూ మంగోలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 34 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా 50 బంతులు ఆడిన అతడు.. 137 రన్స్ చేశాడు. కుశాల్ మ‌ల్లా ఇన్నింగ్స్‌లో 8 ఫోర్స్, 12 సిక్స్‌లు ఉన్నాయి. ఈ అంకెలు చూస్తుంటే అత‌ని బ్యాటింగ్ హ‌వా ఏ ర‌కంగా సాగిందో అర్ధం అవుతుంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో సెంచరీ) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును కుశాల్ మల్లా బ్రేక్ చేశాడు.

Nepal VS Mangolia Highlights asia games 2023
Nepal VS Mangolia Highlights

ఈ మ్యాచ్​లో మరో బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఆరీ (10 బంతుల్లో 52 పరుగులు) కూడా చెలరేగి ఆడాడు. దీపేంద్ర సింగ్ ఆరీ మంగోలియా బౌలర్లను ఉతికి ఆరేశాడు. 9 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్న అతడు.. టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే ఛేజింగ్​లో మంగోలియా కేవలం 41 రన్స్​కే కుప్పకూలింది. దీంతో టీ20 క్రికెట్​లో నేపాల్ చరిత్ర సృష్టిస్తూ.. ఏకంగా 273 రన్స్ భారీ తేడాతో విక్టరీ కొట్టింది. నేపాల్-మంగోలియా మ్యాచ్​లో నమోదైన రికార్డులను ఒక్క‌సారి చూస్తే.. 34 బంతుల్లోనే సెంచరీ, 9 బంతుల్లో ఫిఫ్టీ, వరుసగా 6 సిక్సులు, టీ20 క్రికెట్ హిస్టరీలో హయ్యెస్ట్ స్కోరు, పొట్టి ఫార్మాట్​లో భారీ విజయం ఇలా ప‌లు రికార్డ్స్ న‌మోద‌య్యాయి.

Share
Shreyan Ch

Recent Posts

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

17 hours ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

1 day ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

1 day ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

1 day ago

YS Jagan : జైలు ముందు జ‌గ‌న్‌తో మ‌హిళా కానిస్టేబుల్ సెల్ఫీ.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

YS Jagan : ఈ ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిన జ‌గన్ ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై ఏదో ఒక విధంగా విమ‌ర్శలు…

1 day ago

Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు…

2 days ago

ఏపీ మందు బాబుల‌కు గుడ్ న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం..?

గ‌త ప్ర‌భుత్వంలో నాసిర‌కం మ‌ద్యం వ‌ల‌న చాలా మంది చాలా ఇబ్బందులు ప‌డ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…

2 days ago

YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…

5 days ago