YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న పాలనపై విమర్శలు చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడి పాలనపై విరుచుకుపడంది. వరదల్లో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశారని నిలదీశారు. చిన్నారుల విరాళం కాదు కేంద్రాన్ని నిలదీసి సహాయం పొందాలని సవాల్‌ విసిరారు. ఏపీలో వరదలు అతలాతలం చేస్తే, కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి విజయవాడ రైల్వే డివిజన్ ద్వారా ఏడాది రూ.6 వేల కోట్ల ఆదాయం వస్తుంది.

రైల్వే శాఖ సరఫరా చేసే ‘రైల్ నీర్’ (తాగునీరు) ప్లాంట్ మా విశాఖపట్నంలోనే ఉంది. మన విజయవాడ డివిజన్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంటే వరద బాధితులకు కనీసం మంచినీరు అందించడానికి కూడా కేంద్రం ముందుకు రావడంలేదు. వరద బాధితులకు రైల్ నీర్ వాటర్ బాటిళ్లు ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ తరఫున నేను లేఖ రాసినా పట్టించుకోలేదు. సంవత్సరానికి రూ.6 వేల కోట్ల ఆదాయం అందిస్తున్న ప్రజలు ఇంతటి ఘోర విపత్తుతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే మోదీ ప్రభుత్వం ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతోంది? రాష్ట్ర ప్రజల పట్ల కేంద్రం ఇంత దారుణ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంటే చంద్రబాబు ఇంకా మోదీకి ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు?” అని షర్మిల విమర్శించారు.

YS Sharmila angry on cm chandra babu for collecting money from kids savings
YS Sharmila

“చంద్రబాబు చిన్న పిల్లల దగ్గర కాదు డబ్బులు తీసుకోవాల్సింది. బీజేపీ నుంచి ముక్కుపిండి డబ్బులు తీసుకోవాలి. గత 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు మోదీకి ఊడిగం చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. చంద్రబాబు చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం మాని బీజేపీ నుంచి రూ.10వేల కోట్లు తీసుకుని రావాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. మిత్రధర్మంలో ముచ్చట్లు కాదు, నిధులు కావాలి” అని షర్మిల స్పష్టం చేశారు.బుడమేరు వరదపై టీడీపీ-వైసీపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి. వైఎస్సార్ మరణం తర్వాత బుడమేరును పట్టించుకున్న వాళ్లు లేరు. బుడమేరు వరదకు చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ కారణమే’ అని సంచలన ప్రకటన చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago