Harish Rao : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇష్టమొచ్చినట్టు తిట్టుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మొన్నటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఇప్పుడు వారిపై అనార్హత వేటు అంశం సర్వత్రా ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు.. కీలక తీర్పునిచ్చింది. సదరు ఎమ్మెల్యేలపై.. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఈ విషయం తెలంగాణ అంతటా హాట్ టాపిక్ అయింది. ఇక ఇదే సమయంలో హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుతో రాష్ట్రమంతటా రియల్ ఎస్టేట్ వ్యాపారం సర్వనాశనమైందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని రేవంత్‌రెడ్డి దెబ్బతీశారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మండలాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోయాయని, గతంలో రోజుకు 30 రిజిస్టేషన్లు అయితే ఇప్పుడు నెలకు 30 కూడా కావడం లేదని చెప్పారు.కేంద్రం ఇచ్చిన రూ.800 కోట్ల ఉపాధి హామీ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు. రేషన్‌కార్డ్ నిబంధనలు పెట్టడం వల్లే రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని హరీశ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రెండు సార్లు రుణమాఫీ చేసిందని, ప్రతి పంట సాగుకు ముందే రైతుబంధు అందించి రైతులకు దన్నుగా నిలిచిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో 10 నెలల నుంచి గ్రామ పంచాయతీలకు నిధుల్లేవని హరీశ్‌రావు చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చిపెడుతున్నారని, ఒక్క పైసా కూడా పంచాయతీలకు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏ ప్రభుత్వ దావాఖానకు వెళ్లినా మందుల కొరత ఉన్నదని చెప్పారు. కుక్కల దాడులు పెరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించి సాయం చేసేందుకు వెళ్లిన తమపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం అప్రజాస్వామ్యమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…