ICC World Cup 2023 : ఈ సారి వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం కొత్త రూల్స్.. తొలిసారి కనిపించనున్న 5 ప్రత్యేకతలు..!

ICC World Cup 2023 : రేప‌టి నుండి వన్డే ప్రపంచకప్ 2023 మ‌హాసంగ్రామం మొద‌లు కానుంది. ఇప్పుడు ఎక్క‌డ చూసిన కూడా దీని గురించే చ‌ర్చ‌. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా టీమిండియాబరిలోకి దిగబోతోంది. ఈ ప్రపంచకప్ భారతదేశానికి చాలా పేరు తేవడం పక్కా అని చెప్ప‌వ‌చ్చు. దీనికి మొదటి కారణం మెగా టోర్నమెంట్‌ని నిర్వహించడం. రెండో కారణం.. చరిత్రలో తొలిసారిగా భారత్‌ మాత్రమే ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఇది మాత్రమే కాదు.. ఈసారి ప్రపంచ కప్‌లో అభిమానులు త్రిబుల్ డోస్ థ్రిల్‌ను చూడగలరు. మెగా టోర్నమెంట్‌లో 3 కొత్త రూల్స్ ఉన్నాయి. ఇవి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయబోతున్నాయి.

గతంలో ఎన్నడూ జరగని కొన్ని సంఘటనలు ఈ ప్రపంచకప్‌లో చోటుచేసుకోనున్నాయి. ఈ హోస్టింగ్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఒంటరిగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. గతంలో భారత్ 1987, 1996, 2011లో వన్డే ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చింది. ఇక వన్డే ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ టోర్నీలో వెస్టిండీస్ జట్టు శాశ్వత జట్టుగా కొనసాగుతోంది. కాని వన్డే ప్రపంచకప్ చరిత్రలో కరీబియన్ జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించక‌పోవ‌డం ఇదే తొలిసారి. 1975, 1979లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలో ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ ఈసారి అర్హత సాధించలేకపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

ICC World Cup 2023 new rules this time
ICC World Cup 2023

మునుపటి ప్రపంచ కప్‌లో అంటే 2019 ప్రపంచ కప్‌లో బౌండరీ కౌంట్ నియమం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. మ్యాచ్ టై అయితే సూప‌ర్ ఓవర్ ఆడించేవారు. అయితే టై అయితే ఆ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించారు. ఈ నిబంధన కారణంగా న్యూజిలాండ్ జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. గత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జ‌ర‌గ‌గా, మ్యాచ్ టై అయింది. అనంతరం సూపర్‌ ఓవర్ ఆడ‌గా, అది కూడా టై అయింది. ఈ క్రమంలో ఏ జట్టు ఎక్కువ బౌండరీలు సాధించిన‌ ఇంగ్లండ్ జట్టును ఛాంపియన్‌గా ప్రకటించారు.

దీనిపై విమ‌ర్శ‌లు రాగా, ఐసీసీ ఈ నిబంధనను మార్చింది. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ మ్యాచ్ ఆడతారు. అది కూడా టై అయితే ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్‌ని నిరంతరం నిర్వహిస్తారు. ప్రపంచకప్ వేదికల్లో గ్రాస్ పిచ్ లను సిద్ధం చేయాలని , సరిహద్దు దూరం 70 మీటర్ల కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనను కూడా జారీ చేసింది. ఇక ఐసీసీ ఈ ఏడాది జూన్ నుంచి సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను రద్దు చేసింది. అంటే ఈ సాఫ్ట్ సిగ్నల్ రూల్ ఈ వరల్డ్ కప్ లో కనిపించదు.

Share
Shreyan Ch

Recent Posts

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

17 hours ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

1 day ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

1 day ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

1 day ago

YS Jagan : జైలు ముందు జ‌గ‌న్‌తో మ‌హిళా కానిస్టేబుల్ సెల్ఫీ.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

YS Jagan : ఈ ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిన జ‌గన్ ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై ఏదో ఒక విధంగా విమ‌ర్శలు…

1 day ago

Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు…

2 days ago

ఏపీ మందు బాబుల‌కు గుడ్ న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం..?

గ‌త ప్ర‌భుత్వంలో నాసిర‌కం మ‌ద్యం వ‌ల‌న చాలా మంది చాలా ఇబ్బందులు ప‌డ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…

2 days ago

YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…

5 days ago