YS Sharmila : రోజుకొకళ్ల‌తో తిట్టిస్తున్నారు..రాజ‌న్న బిడ్డ‌తో పెట్టుకోవ‌ద్దంటూ ష‌ర్మిళ వార్నింగ్

YS Sharmila : ష‌ర్మిళ ఏపీలో తెగ సంద‌డి చేస్తుంది. వైసీపీపై విరుచుకుప‌డుతూ తెగ హంగామా చేస్తుంది. అయితే జ‌గ‌న్‌ని విమ‌ర్శిస్తున్న ష‌ర్మిల‌..జ‌గ‌న్ రాజ‌న్న వార‌సుడు కాద‌ని పేర్కొంది. వైఎస్‌.. మాట మీద నిలబడే నాయకుడు.. జగన్‌ మాత్రం మాట తప్పే నాయకుడు.. ఇచ్చిన ప్రతి మాటా తప్పిన జగన్‌, మాటకు కట్టుబడే వైఎ్‌సకు వారసుడెలా అవుతారు..’ అని ఆయన చెల్లెలు, పీసీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఒకప్పుడు వైసీపీని తన భుజాలపై మోశానని, జగనన్న రాజకీయ భవిష్యత్‌ కోసం 3,200 కి.మీ. పాదయాత్ర చేశానని.. వైసీపీని గెలిపించానని.. ఆయన కోసం అనేక ఇబ్బందులకు ఓర్చాననని.. అయినా కనీసం కృతజ్ఞత లేదని దుయ్యబట్టారు. అధికారం చేపట్టగానే జగనన్న మారిపోయారన్నారు.

ఇవాళ తనమీద, తన వ్యక్తిగత జీవితం మీద నానారకాలుగా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను భయపడనని, తాను వైఎస్‌ బిడ్డనని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని 2014లో తిరుపతిలో మోదీ హామీ ఇచ్చారని.. కాంగ్రెస్‌ ఇచ్చే ఐదేళ్ల వ్యవధి సరిపోదని, పదేళ్లపాటు హోదాకావాలన్నారని.. పదిహేనేళ్లు కావాలని ఇదేచోట చంద్రబాబు కూడా అడిగారని.. బీజేపీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెప్పిన మాట ఏమైందని మోదీని ప్రశ్నిస్తున్నానని షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన చేసింది అన్యాయం.. పాపమని స్పష్టం చేశారు. ‘ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ర్టానికి ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. లక్షల ఉద్యోగాలు వచ్చేవి. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ జాతీయ హోదా కల్పించి 90శాతం నిధులు ఇస్తామంది.

YS Sharmila sensational comments about leaders
YS Sharmila

మోదీ ప్రభుత్వం నిధులివ్వలేదు. రాజధాని నిర్మాణానికి సహకారమివ్వలేదు. దక్షిణాదిన మెట్రో రైలు ప్రాజెక్టు లేని ఏకైక రాష్ట్రం ఏపీయే. ఆంధ్ర ప్రజలు అంత తీసిపోయారా? రాష్ట్ర ప్రజలను మోదీ కడుపులో పొడిచారు. అయినా జగనన్న, చంద్రబాబు బీజేపీకి బానిసలయ్యారు. మోదీ రాష్ట్రానికి హోదా ఇచ్చారని బానిసలయ్యారా? ప్రాజెక్టులిచ్చారని భజన చేస్తున్నారా? వీళ్లు బానిసలై.. ఆంధ్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు. అందువల్లే ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఏపీలో రాజ్యమేలుతోంది. రాయలసీమలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే హంద్రీ-నీవా ప్రాజెక్టుకు వైఎస్‌ హయాంలో రూ.4,500 కోట్లు ఖర్చుచేసి.. 90శాతం పనులు పూర్తిచేస్తే, మిగిలిన పది శాతం పనులు పూర్తిచేయడం జగనన్నకు చేతకావడం లేదు అని ష‌ర్మిళ పేర్కొంది.

Share
Shreyan Ch

Recent Posts

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

17 hours ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

1 day ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

1 day ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

1 day ago

YS Jagan : జైలు ముందు జ‌గ‌న్‌తో మ‌హిళా కానిస్టేబుల్ సెల్ఫీ.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

YS Jagan : ఈ ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిన జ‌గన్ ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై ఏదో ఒక విధంగా విమ‌ర్శలు…

1 day ago

Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు…

2 days ago

ఏపీ మందు బాబుల‌కు గుడ్ న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం..?

గ‌త ప్ర‌భుత్వంలో నాసిర‌కం మ‌ద్యం వ‌ల‌న చాలా మంది చాలా ఇబ్బందులు ప‌డ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…

2 days ago

YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…

5 days ago